ల‌గ‌డ‌పాటి సర్వేలో తడబాటు ఎందుకు?

579

మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ్‌గోపాల్ మ‌రోసారి వార్త‌ల్లో వ్య‌క్తిగా మారుతున్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ప్ర‌తిసారీ స‌ర్వేలుచేసి వార్త‌ల్లో వ్య‌క్తిగా మారే రాజగోపాల్ చాలా కాలంగా రాజ‌కీయాల‌కు దూరంగా, వ్యాపారానికి  చేరువ‌గా ఉంటూ వ‌స్తున్నారు. అయితే నంద్యాల ఉప ఎన్నిక ఆరంభంలో ఆయ‌న చేసిన స‌ర్వే వైసిపికి అనుకూల ఫ‌లితాలు వ‌స్తాయ‌ని తేల్చారు. కానీ ఎన్నిక‌లు అయ్యాక మాత్రం టీడీపీ గెలుస్తుంద‌ని స‌ర్వే ఫ‌లితాల‌ను వెల్ల‌డించారు. అయితే ల‌గ‌డ‌పాటి స‌ర్వే ఎపుడూ ఒకే విధంగా ఉండేది. ఈసారి మాత్రం రెండుసార్లు రెండు ర‌కాలుగా ఉండేస‌రికి అనేక అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. (లగడపాటి ప్రత్యేకంగా సర్వే చేయించడు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ కొడుకుకు ఒక సర్వే సంస్థ ఉంది. దానిపేరే చాణక్య. ఆ సంస్థ చేసే సర్వేలను చాలామంది విశ్వసిస్తారు.  ఆ సంస్థ సర్వేలనే లగడపాటి చెబుతుంటారు.)

 ల‌గ‌డ‌పాటి స‌ర్వే ఫలితాలను ఎందుకు మార్చేశారు? ఆయ‌న‌పై వ‌త్తిడి ప‌నిచేసిందా? అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. గ‌తంలో కూడా ల‌గ‌డ‌పాటి ముఖ్య‌మంత్రిని అమ‌రావ‌తి సెక్ర‌టేరియ‌ట్‌లో ఏకాంతంగా క‌ల‌వ‌డం, చ‌ర్చ‌లు జర‌ప‌డం వంటివి చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. అప్ప‌ట్లో ల‌గ‌డ‌పాటి తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నారంటూ ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే లగ‌డ‌పాటి ముఖ్య‌మంత్రితో బేటీ అయింది రాజ‌కీయాల గురించి కాద‌ని, వ్యాపారం కోస‌మ‌ని త‌ర్వాత తెలిసింది. ఇబ్ర‌హీంప‌ట్నం ద‌గ్గ‌ర ఉన్న ల్యాంకో ప‌వ‌ర్ ప్రాజెక్టు విష‌య‌మై ఆయ‌న అప్ప‌ట్లో ముఖ్య‌మంత్రిని క‌లిశారు. ఇపుడు అది సాధించుకున్నారు.

ల‌గ‌డ‌పాటి అధికారంలో ఉన్నా, లేక‌పోయినా ఆయ‌న వ్యాపారాల‌కు ఎక్క‌డా ఎలాంటి ఇబ్బందిలేకుండా చూసుకోవ‌డంలో తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తారు.  అటు కేంద్రంలో బిజెపితో స‌న్నిహితంగా ఉంటూ కాంట్రాక్టులు సాధించుకుంటున్నారు. ఇటు రాష్ర్టంలో తెలుగుదేశంతో అనుకూలంగా ఉంటూ త‌న‌కు కావాల్సిన ప‌నులు చేయించుకుంటున్నారు. మ‌రో వైపు తెలంగాణా ప్ర‌భుత్వంతో కూడా అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తూ అక్క‌డ వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెట్టుకుంటున్నారు. అయితే వైసిపి విష‌యంలో మాత్రం ఆయ‌న ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అందుకే నంద్యాల ఎన్నిక‌లకు ముందు తెలంగాణా సి.ఎం. కెసీఆర్ ఢిల్లీ వెళ్లి మ‌రీ వైసిపి బ‌లం గురించి వెల్ల‌డించారు.

అదే విధంగా ల‌గ‌డ‌పాటి కూడా వైసిపి గురించి సానుకూలంగా మాట్లాడారు. కానీ  వ‌త్తిడి మేర‌కే ప్లేటు ఫిరాయించి మ‌రీ స‌ర్వే ఫ‌లితాలు అంటూ తెలుగుదేశం ప్ర‌భుత్వానికి అనుకూల‌మైన ప్ర‌క‌ట‌న చేయాల్సి వ‌చ్చింద‌ని భావిస్తున్నారు. ఏమైనా ల‌గ‌డ‌పాటి మంచి వ్యాపార వేత్త‌. ఆయ‌న‌ పూర్తిస్థాయి రాజ‌కీయ వేత్త కాదు. సీజ‌న‌ల్ పొలిటీషియ‌న్ మాత్ర‌మే కానీ, నిఖార్స‌యిన రాజ‌కీయ వేత్త మాత్రం కాదు. అలాంట‌పుడు ఆయ‌న చెప్పే స‌ర్వేలు ఎలా ప్రామాణికం అవుతాయి? అని వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి.

Also Read:

NEWS UPDATES

CINEMA UPDATES