వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే..?

160

వడదెబ్బ.. ఈ ఎండాకాలంలో రోడ్లపై ఎక్కువ సమయం తిరిగే వారికి పెనుశాపంగా ఎదురయ్యే సమస్య. ఈ సమస్య పట్ల  ఏమాత్రం అజాగ్రత్త వహించినా ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే సంఘటనలు మనకు తరచూ ఎదురయ్యే కాలం. సూర్యుడి భగభగలు మనల్ని భయభ్రాంతులకు గురిచేసే  పరిస్థితులు ఎన్నోసార్లు తారసపడతాయి. పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల ధాటికి జనం విలవిలలాడుతున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.  ఎక్కడి జనం అక్కడే నీడకు అతుక్కొని ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే మే, జూన్ మాసాల్లో ఎండ తీవ్రత ఎలా ఉండబోతుందోనని జనం భయపడుతున్నారు. 

అధిక ఉష్ణోగ్రతల ధాటికి శరీరము వేడెక్కి నాడీ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం కనిపించక తప్పదు.  ఒళ్ళంతా చెమటలు, నీరసం,డీ హైడ్రేషన్,స్పృహ కోల్పోవడము, అధిక దాహం, గుండె వేగంగా కొట్టుకోవడం, వాంతులు .. ఇలా ఎన్నో సమస్యలకు గురికావాల్సి వస్తుంది.  ముఖ్యంగా వృత్తిరీత్యా బయట తిరిగే వ్యక్తులు మాత్రం తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందులోనూ పసిపిల్లలు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలి.  
ఈ వడ దెబ్బ అనేది ఒక మెడికల్ ఎమెర్జెన్సి..అందుకే దీనిబారిన పడినపుడు వెంటనే అత్యవసర చికిత్స తీసుకోవాలి. లేదంటే కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే ముప్పు ఉంది.  ఈ క్రింది జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

  1. మొదటరోగిని చల్లపరచాలి.
  2. చల్లని ఐస్ వాటర్ లో తడిపిన బట్టలు కప్పాలి.
  3. భుజాల కింద,గజ్జల్లో చల్లని ఐస్ ముక్కలుఉంచాలి.

తీవ్ర ఇబ్బందులకు గురిచేసే ఈ వడదెబ్బబారిన పడకుండా ఉండాలంటే సాధ్యమైనంత వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చల్లని ప్రదేశంలో ఉండేలా చూసుకోవడం,తరచుగా నీరు తాగడం,తెల్లని వదులైన కాటన్ దుస్తులు ధరించడం లాంటి చర్యలు తీసుకుంటే వేడిమి తాకిడి నుంచి బయటపడటమే కాదు మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాము.

NEWS UPDATES

CINEMA UPDATES