విశాఖకు పరిశ్రమలు రావు….

819

విశాఖకు పరిశ్రమలు వచ్చే అవకాశం లేదని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.  విశాఖలో భూముల కొరత తీవ్రంగా ఉందని అందుకే కొత్తగా పరిశ్రమలు వచ్చే అవకాశం లేదన్నారు. గత మూడేళ్లుగా విశాఖలో పరిశ్రమల స్థాపనకు 40 ఐటీ కంపెనీలు ముందుకొచ్చాయన్నారు.  కానీ భూముల కొరత అధికంగా ఉండడంతో వాటికి భూములు కేటాయించలేకపోయామన్నారు.  దాంతో సదరు కంపెనీలు హైదరాబాద్‌, బెంగళూరు తరలిపోతున్నాయని వ్యాఖ్యానించారు.  రాష్ట్రం మొత్తం మీద భూముల కొరత ఉందన్నారు. రానున్న రెండేళ్లలో లక్ష ఐటీ ఉద్యోగాలిస్తామన్నారు లోకేష్.

NEWS UPDATES

CINEMA UPDATES