విశ్రాంతి తీసుకోవాల్సిందిగా జగన్‌కు వైద్యుల సూచన

82

వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు.  నంద్యాలలో ఎగతెరిపి లేకుండా ఎన్నికలప్రచారం నిర్వహించిన జగన్ అనంతరం హైదరాబాద్‌ తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఆయనకు జ్వరం వచ్చింది. నంద్యాల ఎన్నికలప్రచారంలో చాలాసార్లు వర్షానికి తడిసిపోవడంతో జలుబు చేసింది.

అనంతరం తీవ్ర జ్వరం వచ్చింది. గురువారం జ్వరం మరింత ఎక్కువవడంతో వైద్యులు పరీక్షలు చేశారు. కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. గురువారం పార్టీ నాయకులను కూడా జగన్‌పెద్దగా కలవలేదు. వరుసగా 13 రోజుల పాటు నంద్యాలలో జగన్ ప్రచారం నిర్వహించారు.

ఎంతో మందిని స్వయంగా కలుసుకున్నారు. జగన్‌తోపాటు ప్రచారంలో పాల్గొన్న శిల్పామోహన్ రెడ్డి అప్పటికే వైరల్‌ ఫివర్‌తో బాధపడుతూ  ప్రచారానికి వచ్చారు.  మరోవైపు తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారు. అభివృద్ధి పరంగా ఇరు రాష్ట్రాలకు విఘ్నాలు తొలగి అంతా మంచే జరగాలని జగన్ ఆకాంక్షించారు.

NEWS UPDATES

CINEMA UPDATES