సంగీతా చటర్జీ ఆత్మహత్యాయత్నం…. పరిస్థితి విషమం

92

ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎయిర్‌ హోస్టెస్ సంగీతా చటర్జీ ఆత్మహత్యాయత్నం చేసింది. చిత్తూరు సబ్‌జైల్‌లో టాయిలెట్‌ క్లీనర్‌ను తాగి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించింది.  ఉదయం ఆమె ఈ పనిచేసింది. దీంతో పోలీసులు చిత్తూరు ఆస్పత్రికి తరలించారు.  పరిస్థితి విషమంగా ఉంది. గతంలో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసిన సంగీత… ఎర్రచందనం స్మగ్లర్‌ లక్ష్మణ్‌ను వివాహం చేసుకుంది. అతడు జైలుకు వెళ్లగా బయట సంగీతా చక్రం తిప్పుతుండేది. ఈమె ఎర్రచందనం రవాణా చేసేది. అయితే మార్చిలో ఈమెను కోల్‌కతాలో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి చిత్తూరు సబ్‌జైల్‌లో రిమాండ్ ఖైదీగా ఉంటోంది. బెయిల్‌ రాకపోవడంతో ఆందోళనకు గురైన సంగీతా ఆత్మహత్యాయత్నం చేసినట్టు భావిస్తున్నారు. సంగీతా భర్త, స్మగ్లర్‌ లక్ష్మణ్ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైల్లోఉన్నాడు.

NEWS UPDATES

CINEMA UPDATES