సీమలో ఫ్యాక్షన్ పునరుద్ధరణకు వ్యూహాత్మక అడుగులు

829

చంద్రబాబుకు తొలి నుంచి కూడా రాయలసీమ అంటే గిట్టని ప్రాంతమే. ఆ విషయం ఆయన మాట్లలోనే స్పష్టంగా అర్థమవుతుంది. తాను పుట్టింది సీమలోనే అయినా అక్కడి మనుషుల మనసులను చంద్రబాబు గెలవలేకపోయారు. పైగా తనకు గిట్టని సామాజికవర్గాలు బలంగా ఉండడంతో ఆ ప్రాంతంపై చంద్రబాబుది తొలి నుంచీ కక్ష పూరిత వైఖరే. వీలైనంత వరకు రాయలసీమ ప్రాంతానికి ఫ్యాక్షన్‌ నెత్తురు పులిమేలాగే చంద్రబాబు వ్యాఖ్యలు ఉంటున్నాయి.

ఇటీవల కొత్తగా చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా చంద్రబాబు … కనుమరుగు అవుతున్న ఫ్యాక్షన్‌ ను మరోసారి బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానాలు కలగక మానవు. ప్రశాంతంగా ఉండే నంద్యాలలో చోటు చేసుకుంటున్నపరిణామాలను చూస్తుంటే ఆ ప్రాంతంలో శిల్పా కుటుంబానికి , భూమా కుటుంబానికి ఫ్యాక్షన్ తగదాలు రేపేలా చంద్రబాబు వైఖరి కనిపిస్తోంది. ఫ్యాక్షన్‌ను ప్రోత్సహించడంలో తొలినుంచి కూడా చంద్రబాబుది విభిన్న మార్గమే. తాను నేరుగా తలదూర్చరు చంద్రబాబు. కేవలం స్థానికంగా ఇద్దరు నాయకుల మధ్య తగాద ఉంటే దానికి  ఆజ్యం పోస్తుంటారంతే!. నంద్యాలలో మధు అనే వ్యక్తి   నడి రోడ్డుపై వేట కొడవలితో స్వైర విహారం చేసినా ఇప్పటి వరకు  కఠిన చర్యలు లేదు.

ఇలా చేయడం ద్వారా టీడీపీలోని అతివాదులకు చంద్రబాబు ఒకటే సందేశం ఇస్తారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రత్యర్థులను చంపినా, నరికినా, నడిరోడ్డుపై కత్తులతో స్వైర విహారం చేసినా తమపై ఎలాంటి చర్యలు ఉండవన్న అభిప్రాయాన్ని టీడీపీ నేతలకు చంద్రబాబు కల్పిస్తుంటారు. పత్తికొండ వైసీపీ ఇన్‌చార్జ్ నారాయణరెడ్డిని దారుణంగా చంపిన కేసును నీరుగార్చిన విధానం కూడా ఇలాంటిదే. చంద్రబాబు ఇలాంటి సంకేతాలు ఇవ్వడంతో సహజంగానే టీడీపీ నేతలు రెచ్చపోతుంటారు. ఒకప్పుడు అనంతపురం జిల్లాలో వందలమంది కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు చంద్రబాబు వైఖరి వల్లే హత్యలకు గురయ్యారన్న విమర్శ ఉంది. వందల మంది హత్యలకు గురైనా కనీసం ఎఫ్‌ఐఆర్‌లు కూడా అప్పట్లో నమోదు చేయలేదు అనంత పోలీసులు.

ఇదంతా చంద్రబాబు విధానాల్లో ఒక భాగమేనంటుంటారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అండ చూసుకుని టీడీపీ నేతలు రెచ్చిపోయి హత్యలు, దాడులకు, దౌర్జాన్యాలకు తెగిస్తుంటారు. అలా మొదలయ్యే ఫ్యాక్షన్ … ప్రభుత్వం మారగానే అప్పటి వరకు టీడీపీ నేతల చేతిలో దెబ్బతిన్న వైరి పార్టీ వాళ్లు కూడా ప్రతికార హత్యలకు తెగబడుతుంటారు. అవి అలా పెరిగిపెరిగి  అటుఇటు హత్యలు జరుగుతూ ఒక చక్రంలా తయారవుతుంటాయి. అయితే చంద్రబాబు విధానాలను అనంతపురం జిల్లా బాగా అర్థం చేసుకుంది. ఇప్పుడు అధికారం ఉందని ప్రత్యర్థులను హత్య చేస్తే ఆ తర్వాత   ప్రభుత్వం మారితే తాము కూడా ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుందన్న భావన అనంతపురం జిల్లా ఫ్యాక్షన్‌ నేతల్లో బాగా బలపడింది. అందుకే వారు ఫ్యాక్షన్ వైపు మొగ్గు చూపడం లేదు. కానీ గత కొద్దికాలంగా కర్నూలు జిల్లాలో నారాయణరెడ్డి హత్య, అభిరుచి మధు స్వైర విహారం, వాటిపై ప్రభుత్వ చర్యలు నామమాత్రంగా ఉండడం బట్టి చూస్తుంటే కర్నూలు జిల్లా వేదికగా చంద్రబాబు తన వ్యూహాన్ని పక్కాగా అమలు చేస్తున్నారా అన్న అనుమానం కలగకమానదు.. ఈ ఎత్తుల్లో ఇప్పుడు ప్రశాంతమైన  నంద్యాల కూడా చిక్కుకోవడమే బాధాకరం.

NEWS UPDATES

CINEMA UPDATES