సెప్టెంబర్ రెండో వారంలో విశ్వరూపం-2 ఆడియో

220

కమల్ హాసన్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం విశ్వరూపం-2. కొన్నేళ్లుగా వాయిదాపడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. లైకా ప్రొడక్షన్స్ నుంచి ఈ సినిమా పూర్తి హక్కుల్ని కమల్ హాసన్ కొనుక్కోవడంతో విశ్వరూపం-2 విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఇందులో భాగంగా త్వరలోనే ఆడియో ఫంక్షన్ సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చేనెల రెండో వారంలో విశ్వరూపం-2 ఆడియో రిలీజ్ వేడుక ఉంటుంది. జిబ్రాన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

కమల్ హాసన్, పూజాకుమార్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న విశ్వరూపం-2 సినిమా.. ఉగ్రవాదం నేపథ్యంలో నడుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజైంది. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇదే ఊపులో సినిమాను విడుదల చేయాలని కమల్ భావిస్తున్నాడు. ఈ మధ్యే మూవీకి సంబంధించి ప్యాక్ వర్క్ కూడా పూర్తిచేశాడు.

నిజానికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశ్వరూపం-2ను విడుదల చేయాలనేది కమల్ ప్లాన్. కానీ ఆ టైమ్ కు రజనీకాంత్ 2.0 చిత్రం రెడీగా ఉంది. అందుకే మరో కొత్త తేదీ కోసం అన్వేషిస్తున్నాడు.

NEWS UPDATES

CINEMA UPDATES