సెల్ఫీ…చ‌ర్మం పాలిట కిల్‌…ఫీ!

76

ఎక్క‌డ ఉన్నా, ఏం చేస్తున్నా…ఏమీ చేయ‌కుండాఊరికే ఉన్నా… సెల్ఫీ దిగేస్తే ఓ ప‌న‌యిపోతుందిబాబూ…. అనుకుంటున్న యువ‌త‌రంఆలోచించాల్సిన విష‌య‌మే ఇది. ఫోన్ ని మొహానికిద‌గ్గ‌ర‌గా పెట్టుకుని అదేప‌నిగా భిన్న పోజుల‌తోసెల్ఫీలు దిగేవారికి చ‌ర్మ‌వ్యాధుల‌ నిపుణులు ప‌లుహెచ్చ‌రికలు చేస్తున్నారు. ఫోన్ల నుండి వెలువ‌డేరేడియేష‌న్ కార‌ణంగా చ‌ర్మానికి హాని క‌లుగుతుంద‌ని, చ‌ర్మం ముడ‌త‌లు ప‌డుతుంద‌ని, వ‌య‌సుమీరినల‌క్ష‌ణాలు క‌న‌బ‌డ‌తాయ‌ని వీరు చెబుతున్నారు. బ్రిట‌న్‌కు చెందిన వైద్యులు ఈ వివ‌రాలువెల్ల‌డించారు. ఫోన్‌ని చేత్తో ప‌ట్టుకుని సెల్ఫీకోసం ఏవైపు చూస్తారో ఆ వైపు ముఖ చ‌ర్మం హానికి గుర‌య్యేఅవకాశం ఉంద‌ని, ముఖ ఆకృతి చెదిరిపోయేప్ర‌మాద‌ముంద‌ని వారు అంటున్నారు.

ఫోన్ స్క్రీన్ల‌నుండి వెలువ‌డే నీలం రంగు కాంతి చ‌ర్మానికి హాని క‌లిగిస్తుంద‌ని, ఎల‌క్ట్రో మ్యాగ్న‌టిక్ రేడియేష‌న్ కార‌ణంగాచ‌ర్మం డిఎన్ఎ దెబ్బ‌తింటుందంటున్నారు. చ‌ర్మానికి క‌లుగుతున్న హానిని వెంట‌నే గుర్తించ‌డం కూడా క‌ష్ట‌మ‌నిచెబుతున్నారు. సెల్ఫీలు దిగి సోష‌ల్‌మీడియాలో పుంఖాను పుంఖానులుగా పోస్ట్ చేస్తున్న‌వారు ఈ విష‌యాల‌నుతప్ప‌కుండా గుర్తుపెట్టుకుని తీరాలి.

NEWS UPDATES

CINEMA UPDATES