రూ.2500తో ఆధార్ డేటాను హ్యాక్ చెయ్యొచ్చట !

757

వందల వేల సార్లు ప్రయత్నించినా ఆధార్‌ డేటాను బ్రేక్‌ చేయలేరని… యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) చెబుతూ వస్తోంది. అయితే యూఐడీఏఐ మాట‌ల గార‌డికి ప‌డిపోవ‌ద్ద‌ని, కేవ‌లం రూ.2500 ఇస్తే చాలు దేశంలో ఎక్కడున్నా అన‌ధికారిక వ్య‌క్తుల ఆధార్ డేటాను డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చ‌ని హుఫ్ పోస్ట్ ఇండియా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌స్తుతం ఇదే విష‌యం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారింది.

భార‌త్ లో ఆధార్ కార్డ్ గొప్ప విశిష్ట‌త క‌లిగి ఉంది. ప్ర‌భుత్వ ప‌థ‌కాల ల‌బ్ధి చేకూరాల‌న్నా, బ్యాంక్ అకౌంట్ లు ఓపెన్ చేయాల‌న్నా ఇత్యాది అవ‌స‌రాల‌కు ఆధార్ కార్డ్ ప్ర‌ముఖ పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు ఇదే ఆధార్ కార్డ్ భ‌ద్ర‌త‌ పై నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. 

హుఫ్ పోస్ట్ ఇండియా మూడు నెల‌ల‌పాటు  చేసిన ప‌రిశోద‌న‌ల్లో హ్యాక‌ర్లు ప్యాచ్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌ ఇన్‌-బిల్ట్‌ జీపీఎస్‌ సెక్యురిటీ ఫీచర్‌ను డిసేబుల్ చేయ‌డం ద్వారా ఆధార్ డేటాను డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చ‌ని తేలింది. ఈ ప్యాచ్‌ కేవలం రూ.2500కే లభ్యమవుతుందని, దీంతో ఎవ‌రైనా  ఆధార్‌ సాఫ్ట్‌వేర్‌ను హ్యాక్ చెయ్యొచ్చని వెల్లడించింది.

అంతేకాదు యూజర్లను ఎన్‌రోల్‌ చేయడానికి ప్రపంచంలోని ఏ మూల నుంచైనా ఈ సాఫ్ట్‌వేర్‌ను వాడేలా అనధికారిక వ్యక్తులకు అనుమతిస్తుందని పేర్కొంది.

NEWS UPDATES

CINEMA UPDATES