రాధాకృష్ణపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ

2383
abn radha krishna non bailable warrant nampalli court

ప్రధాని మోడీ, వైఎస్ జగన్‌ భేటీపై తప్పుడు కథనాల కేసులో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై నాంపల్లి కోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను రాధాకృష్ణ ధిక్కరించడమే అందుకు కారణం.

మోడీ, జగన్‌ భేటీపై తప్పుడు కథనాలు రాసినందుకు గాను వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై కోర్టుకు హాజరుకావాల్సిందిగా ఆదేశించినా రాధాకృష్ణ వరుసగా రెండోసారి డుమ్మా కొట్టారు.

హాజరు నుంచి మినహాయింపు కోరుతూ హైకోర్టులో రాధాకృష్ణ వేసిన పిటిషన్‌ను హైకోర్టు అంగీకరించకపోయిన నేపథ్యంలో ఈ రోజు ఆయన నాంపల్లి కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. కానీ మరోసారి రాధాకృష్ణ కోర్టు ఆదేశాలను లెక్కచేయలేదు. దీంతో ఆగ్రహించిన నాంపల్లి కోర్టు…. వేమూరి రాధాకృష్ణపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్ జారీ చేసింది.

NEWS UPDATES

CINEMA UPDATES