అబార్షన్లను అనుమతించండి…. 10 లక్షల మంది మహిళల ప్రదర్శన

2075

అబార్షన్లను అనుమతించమని కోరుతూ 10 లక్షల మంది అర్జెంటీనా మహిళలు దేశ రాజధానిలో పెద్ద ప్రదర్శన చేశారు. ప్రస్తుతం అర్జెంటీనాలో ఉన్న చట్టాల ప్రకారం అబార్షన్‌ నేరం. లైంగిక దాడులు జరిగినప్పుడు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో డాక్టర్‌ సలహా పై మాత్రమే అబార్షన్‌ను అనుమతిస్తారు.

తల్లి ఆరోగ్యం బాగాలేకనో, పుట్టబోయే శిశువుకు ప్రమాదం అని తెలిసినా కూడా అక్కడి డాక్టర్‌లు అబార్షన్‌కు అంగీకరించరు. అందువల్ల అర్జెంటీనాలో ప్రతి ఏడాది 30 వేల మంది మహిళలు మరణిస్తున్నారు.

ఈ సమస్యపై స్పందించిన అక్కడి కాంగ్రెస్‌ సభ్యులు అబార్షన్‌కు చట్టబద్ధత కల్పించేలా బిల్లును రూపొందించారు. అయితే ఆ బిల్లును ఆ దేశ అధ్యక్షుడు అంగీకరించకపోవడంతో, అధ్యక్షునికి వ్యతిరేకంగా, అబార్షన్లకు అనుకూలంగా పెద్ద నిరసన ప్రదర్శన చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో తల్లుల ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడేందుకు అబార్షన్‌ తప్పనిసరి అని ఆ మహిళలు కోరుతున్నారు. అబార్షన్లకు చట్టబద్ధత కల్పించేదాకా పోరాడుతామని తెలిపారు.

NEWS UPDATES

CINEMA UPDATES