అల్లు అర్జున్ విలన్ తో తాప్సీ రొమాన్స్.

241
Tapsee Adhi pinisetty kona lovers director hari allu arjun vilan

“సరైనోడు” “నిన్నుకోరి” వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులు, విమర్శకుల ప్రసంశలు పొందిన హీరో ఆది పినిశెట్టి. ఈ చిత్రాల తరువాత పరిశ్రమలో ఆది పినిశెట్టి పేరు మారుమొగిపొయింది. ప్రస్తుతం ఆది పినిశెట్టి రామ్ చరణ్ “రంగస్థలం 1985″లోను అలాగే పవన్ కల్యాణ్ “అజ్ఞాతవాసి”లోను ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నాడు. ఇవి కాకుండా ఆది హీరోగా ఒక కొత్త సినిమా మొదలవబోతుంది. కోన ఫిలిం కార్పోరేషన్, ఎం.వి.వి సినిమాలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాని “లవర్స్” సినిమా దర్శకుడు హరి దర్శకత్వం చేయనున్నారు. ఇందులో ఆది సరసన తాప్సీ హీరోయిన్ గా నటించనుంది. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్న ఆ సినిమా వైజాగ్, హైదరాబాద్, విజయవాడ నేపధ్యంలో సాగుతుంది. గోపిసుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి తోటరాజు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా కోన వెంకట్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు పరిశ్రమలో సోలో హీరోగా సరైన విజయం లేక బాధపడుతున్న ఆది పినిశెట్టికి ఈ సినిమా విజయం అందిస్తుందేమో చూడాలి.

NEWS UPDATES

CINEMA UPDATES