400 థియేటర్లలో ‘అదిరింది’

501

తమిళ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మెర్సెల్. ఈ సినిమా తెలుగులో అదిరింది పేరుతో డబ్ అయింది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఒకేసారి ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. కానీ సెన్సార్ లో సమస్యలు తలెత్తి సాధ్యంకాలేదు. దీపావళికి కోలీవుడ్ లో విడుదలైన ఈ సినిమాకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలుగులో కూడా విడుదల చేసేయాలని నిర్ణయించాడు నిర్మాత శరత్ మరార్.

దాదాపు వంద కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 400 థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు. ఈమధ్య కాలంలో ఏ డబ్బింగ్ సినిమాకు ఇన్ని థియేటర్లు దక్కలేదు. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. తెలుగులో పాపులర్ అయిన సమంత, కాజల్ హారోయిన్లుగా నటించారు. అందుకే అదిరింది సినిమాకు అదిరిపోయే రేంజ్ లో వసూళ్లు వస్తాయని భావిస్తున్నాడు శరత్ మరార్.

NEWS UPDATES

CINEMA UPDATES