బాబాయ్ తో కలిసి వస్తాను అంటున్న రామ్ చరణ్

372

పవన్ కళ్యాణ్ ఇంకా త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చే మూవీ పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్, వర్కింగ్ స్టిల్స్ చూస్తుంటే మళ్ళీ ఈ మూవీ తో వీరిద్దరూ కలిసి ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయం అని ఫిక్స్ అయిపోయారు అంతా. ఇంకా టైటిల్ అంటూ పెట్టని ఈ మూవీ యొక్క ఆడియో లాంచ్ ని డిసెంబర్ 14 న జరిపి జనవరి 10 న మూవీ ని రిలీజ్ చేయనున్నారు.

అయితే ఈ మూవీ థియేటర్స్ లో సందడి చేసే టైం లో ఈ మూవీ యొక్క ఇంటర్వెల్ లో రామచరణ్ నటిస్తున్న “రంగస్థలం 1985” ట్రైలర్ వేస్తారు అంట. రామ్ చరణ్ ఇప్పటికే ఈ విషయం గురించి త్రివిక్రమ్ తో మాట్లాడినట్టు తెలుస్తుంది. మొత్తానికి అటు బాబాయ్ తో పాటు థియేటర్స్ లోకి వచ్చి మెగా ఫాన్స్ అందరిని ఖుషి చేయడానికి రెడీ అయిపోయాడు రామ్ చరణ్. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో సమంతా హీరోయిన్ గా నటిస్తుంది. “రంగస్థలం 1985” కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది.

NEWS UPDATES

CINEMA UPDATES