శాటిలైట్ రైట్స్ లో రికార్డు

344

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు పవన్. కెరీర్ లో ఇతడికిది 25వ చిత్రం కావడం విశేషం. మామూలుగానే పవన్ సినిమాలకు శాటిలైట్ రైట్స్ విభాగంలో భారీ డిమాండ్ ఉంటుంది. దానికి త్రివిక్రమ్ కూడా యాడ్ అయితే రేటు మరింత పెరగడం ఖాయం. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలు తెరపై ఎంత హిట్ అవుతాయో.. టీవీల్లో టీఆర్పీ విషయంలో కూడా అంతే స్ట్రాంగ్. అందుకే ఈ డైరక్టర్ తీసే సినిమాల్ని ఏ ఛానెల్ మిస్ చేసుకోదు.

ఈసారి పవన్-త్రివిక్రమ్ కాంబో శాటిలైట్ విభాగంలో హాట్ కేక్ గా మారింది. గతంలో వీళ్లిద్దరూ కలిసి తీసిన అత్తారింటికి దారేది సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో ఈసారి వీళ్లు చేస్తున్న అజ్ఞాతవాసి సినిమా శాటిలైట్ రైట్స్ ధర కొండెక్కి కూర్చుంది.

14 కోట్ల రూపాయల నుంచి ప్రారంభమైన ఈ సినిమా శాటిలైట్ బిడ్డింగ్.. ఫైనల్ గా 19 కోట్ల 50లక్షల రూపాయలకు ఫిక్స్ అయింది. భారీ కాంపిటిషన్ మధ్య జెమినీ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్.. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ దక్కించుకుంది. జీ తెలుగు ఛానెల్ ఆఖరి నిమిషం వరకు పోటీపడినప్పటికీ ఫైనల్ గా జెమినీకే పవన్ సినిమా వరించింది.

 

NEWS UPDATES

CINEMA UPDATES