పబ్లిక్ గా.. అఖిల్ ఆటాపాటా.. మీరూ చూస్తారా!

152

అక్కినేని యువ అందగాడు.. అఖిల్ సినిమా శరవేగంగా ముస్తాబవుతోంది. షూటింగ్ పార్ట్ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియోను.. 10న విశాఖపట్నంలో లాంచ్ చేస్తున్నారు. మనంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చి గ్రాండ్ సక్సెస్ అందుకున్న అఖిల్.. తర్వాత.. తన పేరుతోనే చేసిన అఖిల్ తో అట్టర్ ఫ్లాప్ ను మూటగట్టుకున్నాడు.

దీంతో.. హలో సినిమాను తనే స్వయంగా నిర్మిస్తున్న తండ్రి నాగార్జున.. తమ ఆస్థాన దర్శకుడు, వరుస హిట్ల డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కు.. హలో బాధ్యత అప్పగించాడు. ఆ బాధ్యతను దర్శకుడు సక్సెస్ ఫుల్ గా నిలబెట్టుకున్నట్టు ట్రయిలర్ చూస్తే అర్థమైపోతోంది. ఇప్పుడు.. సినిమా ఆడియో కూడా విడుదల కాబోతోంది.

హలో పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న అఖిల్.. ఆడియో విడుదలతో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఈవెంట్ లో పాట పాడడమే కాదు.. డ్యాన్సులతో షేక్ చేసేందుకూ ప్రాక్టీస్ చేస్తున్నాడట. ఈ విషయాన్ని నాగార్జున కూడా కన్ఫమ్ చేసేశాడు. అఖిల్ బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడని కాంప్లిమెంట్ కూడా ఇచ్చేశాడు.

NEWS UPDATES

CINEMA UPDATES