రూ. 50 కోట్లు బిజినెస్ చేసిన హలో

220

మొదటి సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అయినా రెండో సినిమాకు మాత్రం క్రేజ్ తగ్గలేదు. అఖిల్ సినిమా అటు ఇటుగా 50 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. థియేట్రికల్ రైట్స్ రూపంలో ఈ మూవీ ఇప్పటికే 38 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేయగా… శాటిలైట్, డబ్బింగ్, డిజిటల్, ఆడియో రైట్స్ కూడా కలుపుకుంటే ఈ లెక్క 50 కోట్ల రూపాయలు తేలింది.

అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ లో ఇదే అతిపెద్ద భారీ బడ్జెట్ చిత్రం అయినప్పటికీ.. విడుదలకు ముందే నాగార్జునను సేఫ్ జోన్ లో పెట్టింది హలో సినిమా. పైగా ఈ సినిమాకు సంబంధించి వైజాగ్, కృష్ణా ఏరియాల్లో నాగార్జునే స్వయంగా హలో సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

ప్రాంతాల వారీగా హలో ప్రీ-బిజినెస్

ఆంధ్రా – రూ. 15 కోట్లు
సీడెడ్ – రూ. 5 కోట్లు
నైజాం – రూ. 11 కోట్లు
రెస్టాఫ్ – రూ. 7 కోట్లు (మిగతా రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్)

టోటల్ ప్రీ-రిలీజ్ బిజినెస్ – రూ. 38 కోట్లు

NEWS UPDATES

CINEMA UPDATES