గోవాలో పని పూర్తిచేసిన బన్నీ

266

హీరో బన్నీ కొన్ని రోజులుగా గోవాలో ఉన్న విషయం తెలిసిందే. నా పేరు సూర్య సినిమా కోసం గోవాలో తిష్ట వేశాడు ఈ హీరో. అక్కడే విలన్ తో ఓ ఫైట్ సీక్వెన్స్, హీరోయిన్ అను ఎమ్మాన్యుయేల్ తో ఓ డ్యూయట్ వేసుకున్నాడు. అలా గోవా షెడ్యూల్ ను ఓ కొలిక్కి తీసుకొచ్చాడు బన్నీ.

రేపటితో నా పేరు సూర్య సినిమా షెడ్యూల్ కంప్లీట్ అయిపోతుంది. షెడ్యూల్ అయిన వెంటనే యూనిట్ అంతా హైదరాబాద్ చేరుకుంటుంది. కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని కొత్త షెడ్యూల్ మళ్లీ ప్రారంభిస్తారు. ఏప్రిల్ 27న నా పేరు సూర్య సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. నా ఇల్లు ఇండియా అనేది ఈ సినిమాకు ట్యాగ్ లైన్.

రామలక్ష్మీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న నా పేరు సూర్య సినిమాకు లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మాత. నాగబాబు ఈ మూవీని సమర్పిస్తున్నారు. విశాల్-శేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES