కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసే పనిలో అల్లు అర్జున్

160

అల్లు అర్జున్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకి ఉన్న పరిచయాల ద్వారా, అలాగే సినిమాల ద్వారా ఎంతో మంది కొత్త దర్శకులను ఇంట్రడ్యూస్ చేసాడు. అయితే ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ని అందుకున్నాక కూడా బన్ని ఇప్పుడు ఇదే పని చేస్తున్నాడు. బన్ని తలుచుకుంటే స్టార్ డైరెక్టర్స్ తో సినిమా తియ్యగలడు. కాని కొత్త దర్శకులకి అవకాశం ఇద్దాం అనే ఆలోచనతో అల్లు అర్జున్ తన తదుపరి సినిమాలని కొత్త దర్శకులతో చేస్తున్నాడు. ఇప్పటికే వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ “నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా” అనే మూవీ ని చేస్తున్నాడు అల్లు అర్జున్. లగడపాటి శ్రీధర్ ఈ మూవీ ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ప్రస్తుతం గోవా లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఆరంభం లో విడుదల కాబోతుంది.

అయితే ఈ మూవీ అయిపోగానే బన్ని ఇద్దరు కొత్త దర్శకులతో మూవీ ని స్టార్ట్ చేస్తాడు అని టాక్. అవును సంతోష్ రెడ్డి ఇంకా ప్రశాంత్ అనే ఇద్దరు కొత్త డైరెక్టర్స్ తో మూవీ చేస్తాడట బన్ని. ఇప్పటికే ప్రశాంత్ అనే కుర్రాడు చెప్పిన కథ బన్ని నచ్చి ఓకే చేసాడు అని తెలిసింది. ఈ విషయం పై ఇంకా క్లారిటీ రావాలి అంటే “నా పేరు సూర్య…నా ఇల్లు ఇండియా” షూటింగ్ అయిపోయేవరకు వెయిట్ చేయాల్సిందే.

NEWS UPDATES

CINEMA UPDATES