మంచు కొండల్లో చిందులేస్తున్న బన్నీ

267
భారత్-పాకిస్థాన్ బోర్డర్ లో బన్నీ ఉన్న విషయం తెలిసిందే. నా పేరు సూర్య సినిమాకు సంబంధించి వణికించే చలిలో బన్నీ షూటింగ్ చేస్తున్నాడు. నిన్నటివరకు ఈ సినిమాకు సంబంధించి యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించారు. ఇవాళ్టి నుంచి పాట షూటింగ్ స్టార్ట్ చేశారు.
ఇప్పటికే విడుదలైన దిల్లే ఇండియా.. ఇల్లే ఇండియా అనే సింగిల్ షూటింగ్ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. భారత సైనికుల పహారా మధ్య ఈ షూటింగ్ ను జరుపుతున్నారు. ఈ పాట షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే యూనిట్ హైదరాబాద్ వచ్చేస్తుంది. ప్రస్తుతం శ్రీనగర్ లో 8 డిగ్రీల సెంటీగ్రేట్ ఉష్ణోగ్రత ఉంది. అంత చలిలో కష్టపడి షూటింగ్ చేస్తోంది నా పేరూ సూర్య యూనిట్
మరోవైపు ఈ మూవీకి సంబంధించి వాలంటైన్స్ డే సందర్భంగా మరో వారం రోజుల్లో ఓ రొమాంటిక్ సింగిల్ ను విడుదల చేయబోతున్నారు. అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 27న థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES