బీజేపీకి ఓటు వేయవద్దంటున్న అమిత్‌ షా

539

బిజెపి అధ్య‌క్షుడు అమిత్ షా పొర‌పాటు ప‌డ్డారు. క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన ఒక స‌మావేశంలో ప్ర‌సంగిస్తున్న అమిత్ షా…రాష్ట్రంలో పాల‌న‌పై విమ‌ర్శ‌లు చేశారు. ముఖ్య‌మంత్రి సిద్ధరామ‌య్య‌ను విమ‌ర్శించాల్సిన అమిత్ షా ..పొర‌పాటున త‌మ పార్టీ క‌ర్ణాట‌క చీఫ్ యెడ్యూర‌ప్ప‌ను విమ‌ర్శించారు.

ప్ర‌వాహంలా కొన‌సాగుతున్న ప్రసంగాన్ని ఆప‌డానికి ఎవ‌రికి ఛాన్స్ ల‌భించ‌లేదు. చివ‌రికి ఎంపీ అనంత్ కుమార్ క‌ల్పించుకుని అమిత్ షా కు విష‌యం తెలియ‌జేశారు. దీంతో పొర‌పాటు తెలుసుకున్న అమిత్ షా క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఈ స‌న్నివేశ‌మంతా రికార్డయింది. అది ప్ర‌స్తుతం నెట్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

ప్ర‌జ‌ల‌కు ఏమీ చేయ‌ని బిజెపికి ఎందుకు ఓటేయాల‌ని అమిత్ షా ప్ర‌శ్నించారు. త‌ర్వాత త‌న పొర‌పాటును స‌వ‌రించుకున్నారు. ఆ త‌ర్వాత కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించారు. అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ఖర్చుపెట్టాల్సిన నిధులు ఎక్క‌డికి పోతున్నాయ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

NEWS UPDATES

CINEMA UPDATES