నంది అవార్డులా !ఫ్యామిలీ ప్యాక్ అవార్డులా!

997

2014
ఉత్తమ చిత్రం – లెజెండ్‌
ఉత్తమ డైరెక్టర్ – బోయపాటి శ్రీను(లెజెండ్)
ఉత్తమ నటుడు – బాలకృష్ణ (లెజెండ్)
ఉత్తమ విలన్ – జగపతి బాబు ( లెజెండ్)

ఇవి చంద్రబాబు కుటుంబం ప్రకటించిన అవార్డులు కాదు. ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన 2014 నంది అవార్డులు. మొత్తం అవార్డుల్లోని కేట‌గిరీల్లో ప్ర‌ధాన‌మైన‌వి ఈ సినిమాకు ఇచ్చారు. ఇప్పుడు ఈ అవార్డుల‌పై సోష‌ల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఇవి నంది అవార్డులా లేక కుటుంబం అవార్డులా అని ప్ర‌శ్నిస్తున్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన హీరో, అంతేకాదు సొంత బావ మ‌రిది, మ‌రోవైపు త‌న కూతురిని తన కొడుకు ఇచ్చాడు. ఆయ‌న కూడా అవార్డుల క‌మిటీలో ఉన్నారు. ఇంకేముంది బాల‌య్య సినిమాల‌కు అవార్డుల పంట పండింది. దీని కోసం ఒక క‌మిటీ వేయ‌డం ఎందుకు? అని ప్ర‌శ్నిస్తున్నారు. చివ‌ర‌కు అవార్డులు కూడా ఇలా త‌మ‌వారికే ఇచ్చుకోవ‌డం చంద్ర‌బాబు స‌ర్కార్‌కే చెల్లింద‌ని పోస్టులు పెడుతున్నారు.

మూడేళ్లకు ప్ర‌క‌టించిన అవార్డులు చూస్తే ప్ర‌ధానంగా త‌మ‌కు ఇష్ట‌మైన వారికే అవార్డులు ఇచ్చిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. త‌మ పార్టీకి అనుకూలంగా ఉన్న న‌టుల‌కే ఈ సారి ప్రాధాన్య‌త ఇచ్చార‌నే గుస‌గుస‌లు విన్పిస్తున్నాయి. ఇటు ఒక శ్రీమంతుడు సినిమాకు త‌ప్ప వేరే సినిమాల‌కు పెద్ద అవార్డులు రాలేదు. ఒక్క శ్రీమంతుడికి ఆరు నంది అవార్డులు వ‌చ్చాయి. అక్కినేని వారి మ‌నం సినిమా ద్వితీయ ఉత్త‌మ చిత్రంగా ఎంపికైంది. టీడీపీ పార్టీకి ద‌గ్గ‌రగా ఉండే డైరెక్టర్లు బోయ‌పాటి శీను, రాజ‌మౌళికి ఉత్త‌మ ద‌ర్శ‌కులుగా అవార్డులు ద‌క్కాయి. ఇప్ప‌టికైతే సినిమా ప్ర‌ముఖులు ఈ అవార్డుల‌పై స్పందించ‌లేదు. అయితే టీడీపీ అనుకూల సినీన‌టుల కోసమే ఈ అవార్డులు పెట్టిన‌ట్లు ఉంద‌ని మాత్రం విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. శతమానంభవతి సినిమాకు రాని అవార్డు కూడా ఒక అవార్డేనా? అని నెటిజన్ లు మండిపడుతున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES