ఏపీ నేత‌లు అవినీతిలో దొర్లుతున్నారు –  షాకింగ్ స‌ర్వే రిపోర్ట్

7124
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అవినీతిపై ప్ర‌భుత్వం చేయించుకున్న‌స‌ర్వేలో షాకింగ్ విష‌యాలు వెలుగుచూశాయి.  ఏపీలో నేత‌లు, అధికారులు భారీ స్థాయిలో అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని… అత్య‌ధిక శాతం మంది అభిప్రాయ‌ప‌డ్డారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అవినీతికి ప్ర‌ధాన కార‌కులు నేత‌లు, అధికారులేన‌ని జ‌నం ఆవేద‌న చెందారు. ఈ స‌ర్వేను ఆంగ్ల దిన‌ప‌త్రిక ప్ర‌చురించింది.
 74 శాతం మంది ప్ర‌జ‌లు రాజ‌కీయ నాయ‌కులు భూక‌బ్జాల్లో కీల‌కంగా ఉన్నార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇసుక అక్ర‌మ ర‌వాణాలోనే 40శాతం మంది రాజ‌కీయాలు పాల్గొంటున్నార‌ని ప్ర‌భుత్వ స‌ర్వేలో ప్ర‌జ‌లు వెల్ల‌డించారు. భ‌వ‌న‌నిర్మాణ అనుమతుల విష‌యంలో అవినీతి ఉంద‌ని స‌ర్వేలో పాల్గొన్న వారిలో 100 శాతం మంది అభిప్రాయ‌ప‌డ‌డం గ‌మ‌నార్హం. ఈ స‌ర్వేలో ఐవీఆర్ ఎస్ విధానాన్ని ప్ర‌భుత్వం ముఖ్యంగా ఫాలో అయింది. ఇసుక‌ను ఉచితంగా ఇస్తామ‌ని ప్ర‌భుత్వం చెబుతున్నా.. వాస్త‌వ ప‌రిస్థితి వేరే ఉంద‌ని ప్ర‌జ‌లు చెబుతున్నారు.
ట్రాక్ట‌ర్ ఇసుక‌కు 1300కు మించి తీసుకోకూడ‌ద‌ని చెబుతున్నా… చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులో ట్రాక్ట‌ర్ ఇసుక‌కు ఏకంగా రూ. 5వేల 327 వ‌సూలు చేస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోనూ అవినీతి రాజ్య‌మేలుతున్న‌ట్టు స‌ర్వేలో తేల్చారు. మొత్తం మీద ప్ర‌భుత్వం నిర్వ‌హించుకున్న స‌ర్వేలో ఆంధ్ర‌ప్రదేశ్ లో క‌రెన్ఫ‌న్ నిర్భ‌యంగా సాగుతున్న‌ట్టు తేలింది.

NEWS UPDATES

CINEMA UPDATES