దివాలా కేస్‌లో అనిల్ అంబానీ

609

రిల‌యెన్స్ క‌మ్యూనికేష‌న్స్ మార్కెట్ ఒడిదొడుకుల్లో ఉంది. ఆ సంస్థ రేటింగ్‌ను త‌గ్గిస్తున్న‌ట్లు ఫిట్చ్ తెలియ‌చేసింది. ఇది కంపెనీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. ఈ రిపోర్టు ఇలా ఉంటే రిల‌యెన్స్ క‌మ్యూనికేష‌న్స్ షేర్ల ధ‌ర‌లు ఏడు శాతం ప‌డిపోయాయి. రిల‌యెన్స్ క‌మ్యూనికేష‌న్స్ మీద ప‌లు కంపెనీలు న్యాయ‌ప‌రంగా కేస్‌లు వేశాయి. ఈ కేస్‌ల గురించి నేష‌న‌ల్ కంపెనీ లా ట్రిబ్యున‌ల్ ఎదుట‌ ఈ నెల 19వ తేదీన వాద‌న‌లు వినిపించాల్సి ఉంటుంది.

అనేక క‌మ్యూనికేష‌న్ కంపెనీల‌కు భారీ మొత్తంలో రుణాలు మంజూరు చేసిన చైనా డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంకు న‌వంబ‌ర్ 28వ తేదీ రిల‌యెన్స్ క‌మ్యూనికేష‌న్ మీద ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌ర‌ప్ట్ కోడ్ కింద కేస్ న‌మోదు చేసింది. దీనికి రెండు నెల‌ల‌ ముందు సెప్టెంబ‌ర్‌లో ఎరిక్‌స‌న్ ఇండియా విభాగం కూడ త‌మ‌కు రావ‌ల‌సిన బ‌కాయిల‌ను వ‌సూలు చేసుకోవ‌డానికి కేస్ వేసింది. ఈ రెండు కంపెనీల‌కు క‌లిపి రిల‌యెన్స్ క‌మ్యూనికేష‌న్స్ 15 వంద‌ల కోట్లు చెల్లించాలి. దీనితోపాటు క‌ర్నాట‌కకు చెందిన మ‌ణిపాల్ టెక్ కంపెనీ త‌మ‌కు రావాల్సిన 2.74 కోట్ల‌ను ఇప్పించ‌వ‌ల‌సిందిగా న్యాయ‌స్థానాన్ని కోరింది.

ఈ ప‌రిణామాల‌ను చాలా సాధార‌ణ విష‌యాలుగా అభివ‌ర్ణిస్తున్నారు రిల‌యెన్స్ క‌మ్యూనికేష‌న్స్‌ ప్ర‌తినిధులు. కంపెనీ చెల్లింపుల‌కు సంబంధించి గ‌డువు ముగిసిపోలేద‌ని, చెల్లించ‌డానికి త‌మకు స‌మ‌యం ఉంద‌ని చెబుతూ త‌మ కంపెనీకి 2018 డిసెంబ‌ర్ వ‌ర‌కు య‌థాత‌థ స్థితిలో కొన‌సాగే అవ‌కాశం ఉంద‌న్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES