రామ్ చరణ్ సరసన పవన్ హీరోయిన్

174

బబ్లీ బ్యూటీ అను ఎమ్మాన్యుయేల్ మరో బిగ్ ఆఫర్ అందుకుంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ సరసన అజ్ఞాతవాసి సినిమా చేస్తున్న ఈ హీరోయిన్.. త్వరలోనే రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చెర్రీ ఓ మూవీ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. రీసెంట్ గా ఈ మూవీ పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ సినిమాలో చరణ్ సరసన హీరోయిన్ గా అను ఎమ్మాన్యుయేల్ ను తీసుకున్నారు.

డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మాతగా జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ప్రస్తుతానికి అను ఎమ్మాన్యుయేల్ సెలక్షన్ ను సీక్రెట్ గా ఉంచుతున్నారు. త్వరలోనే అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతోంది చెర్రీ-బోయపాటి సినిమా.

ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా కొనసాగుతోంది అను ఎమ్మాన్యుయేల్. మజ్ను సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. ప్రస్తుతం అజ్ఞాతవాసి సినిమాతో పాటు బన్నీ సరసన నా పేరు సూర్య అనే మూవీలో నటిస్తోంది. నాగచైతన్య, మారుతి కాంబినేషన్లో రానున్న సినిమాలో కూడా సెలక్ట్ అయింది. ఇప్పుడు రామ్ చరణ్ మూవీలో నటించే అవకాశం అందుకుంది.

NEWS UPDATES

CINEMA UPDATES