అరవింద సమేత ఆడియో డేట్ ఫిక్స్

646

సెప్టెంబర్ 20న అరవింద సమేత ఆడియో ఉంటుందని కొందరు, ఉండదని మరికొందరు సోషల్ మీడియాలో వాదించుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. వినాయక చవితి సందర్భంగా అరవింద సమేత సినిమా నుంచి మరో చూడచక్కని పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్, పనిలోపనిగా ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 20న ఆడియో లాంఛ్ ఉంటుంది.

ఆడియో విడుదల కార్యక్రమాన్ని రద్దుచేసి, సినిమా రిలీజ్ కు కొన్ని రోజుల ముందు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెడతారంటూ మొన్నటివరకు ప్రచారం సాగింది. అయితే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ తో పాటు ఆడియో రిలీజ్ కూడా సెలబ్రేట్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. టైట్ షెడ్యూల్ మధ్య కూడా ఆడియో ఫంక్షన్ కు డేట్ ఫిక్స్ చేశారు.

ఈ ఆడియో ఫంక్షన్ కు బాలకృష్ణ ప్రత్యేక అతిథిగా వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మరో వారం రోజుల్లో అధికారికంగా ప్రకటించబోతున్నారు. మరోవైపు ఇదే వేడుకకు చంద్రబాబు నాయుడు వస్తారా రారా అనే విషయంపై కూడా సీఎం ఆఫీస్ నుంచి మరో 2 రోజుల్లో సమాచారం అందనుంది.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న అరవింద సమేత చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు చినబాబు నిర్మాత. దసరా కానుకగా థియేటర్లలోకి రానుంది అరవింద సమేత చిత్రం.

NEWS UPDATES

CINEMA UPDATES