అరవింద సమేత హంగామా మొదలు

573

ఎన్టీఆర్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న అరవింద సమేత సినిమా హంగామా ఇవాళ్టి నుంచి మొదలైంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను తాజాగా విడుదల చేశారు. అనగనగనగా అనే లిరిక్స్ తో సాగే ఈ పాటకు తమన్ సంగీతం అందిస్తే, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం సమకూర్చారు.

ఈ లిరికల్ వీడియోకు ఓ ప్రత్యేకత ఉంది. సాధారణంగా బ్యాక్ గ్రౌండ్ లో సాంగ్ పెట్టి, పైన ఫొటోలు పెట్టి లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. కానీ అరవింద సమేత ఫస్ట్ లిరికల్ వీడియోలో మాత్రం ఏకంగా ఓ చిన్న వీడియో క్లిప్ చూపించి సాంగ్ స్టార్ట్ చేశారు. నందమూరి అభిమానులకు ఇది బోనస్ అన్నమాట.

అరవింద సమేత ప్రస్తుతం షూటింగ్ మోడ్ లో ఉంది. నెలాఖరుకు ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. మరోవైపు మరో సాంగ్ విడుదల చేసి, తర్వాత టోటల్ ఆడియో సాంగ్స్ అన్నింటినీ ఒకేసారి 20వ తేదీన విడుదల చేయబోతున్నారు. దసరా ఎట్రాక్షన్ గా అరవింద సమేతను విడుదల చేయబోతున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES