రామ్ చరణ్ కి మరో అన్నగా ఆర్యన్ రాజేష్

301

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంకా బోయపాటి కాంబినేషన్ లో ఒక మూవీ స్టార్ట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. గత నెలలో షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ మూవీ ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ లో రామ్ చరణ్ కి అన్న గా తమిళ్ హీరో అయిన ప్రశాంత్ నటిస్తుంటే, వదిన గా స్నేహ నటిస్తుంది.

అయితే ఈ మూవీ లో రామ్ చరణ్ కి మరో అన్న పాత్ర ఉంది. అయితే ఈ క్యారెక్టర్ కోసం అల్లరి నరేష్ కి అన్న అయిన ఆర్యన్ రాజేష్ ని సెలెక్ట్ చేసాడట బోయపాటి శ్రీను.

హీరో గా సక్సెస్ కాలేక చతికిలబడిపోయిన రాజేష్ కి ఇదొక మంచి అవకాశం. మళ్ళీ ఈ మూవీ ద్వారా ఆర్యన్ రాజేష్ కి మంచి అవకాశాలు రావాలి అని చాలా మంది కోరుకుంటున్నారు.

ఇదిలా ఉంటే బోయపాటి శ్రీను తీసిన “లెజెండ్” మూవీ తో జగపతి బాబు కి లైఫ్ ఇచ్చి తనతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయించాడు. ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఆర్యన్ రాజేష్ తో ఇలా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయించే పనిలో ఉన్నాడు బోయపాటి శ్రీను.

NEWS UPDATES

CINEMA UPDATES