ఢిల్లీ పోలీసుల అదుపులో మరో రేపిస్ట్ బాబా

1298

ఆశారాం బాబా, గుర్మీత్ బాబాల ఉదంతాలు మ‌రిచిపోక ముందే మ‌రో బాబా బాగోతాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఆసూ భాయ్ అనే దొంగ బాబాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆసూ భాయ్ బాబా ఢిల్లీలో త‌న ఆశ్ర‌మంలో ఓ మ‌హిళ‌పై అత్యాచారం చేసిన‌ట్లు పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. బాధిత మ‌హిళ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలో దిగిన ఢిల్లీ పోలీసులు ఆసూ భాయ్ బాబాతో పాటు అత‌డి కుమారుడిని కూడా అరెస్టు చేశారు.

ఆసూ భాయ్ గా మారిన‌ ఆసిఫ్ ఖాన్‌కు ఢిల్లీలో మంచి ఫాలోయింగ్ ఉంది. ప‌లు టివిల్లో జ్యోతిషం పేరిట అనేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేవాడు. త‌న ఆశ్ర‌మానికి వ‌చ్చిన మ‌హిళా భ‌క్తుల బ‌ల‌హీన‌త‌లతో ఆడుకుంటున్న ఆసూభాయ్‌తో పాటు అత‌ని కుమారుడు స‌మ‌ర్ ఖాన్‌ను కూడా ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి కొన్ని గంట‌ల పాటు విచారించారు.

బాధిత మ‌హిళ తాను ఇచ్చిన ఫిర్యాదులో అనేక అంశాల‌ను వెల్ల‌డించింది. ఆసూ భాయ్ ఏ విధంగా బెదిరించి త‌న‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డాడో వివ‌రించింది. త‌న కుమార్తెతోను అనుచితంగా ప్ర‌వ‌ర్తించేవాడ‌ని త‌న ఫిర్యాదులో తెలిపింది. బాబాతో పాటు అత‌డి కుమారుడు త‌న‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డాడ‌ని బాధిత మ‌హిళ త‌న ఫిర్యాదులో పోలీసుల‌కు తెలియ‌జేసింది.

దొంగ బాబాపై కేసు న‌మోదు

బాధిత మ‌హిళ ఇచ్చిన ఫిర్యాదును ప‌రిశీలించిన మీద‌ట ఆశ్ర‌మంపై దాడి చేసి బాబాను అరెస్ట్ చేసిన పోలీసులు అనేక సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. సెక్ష‌న్ 376 డి (గ్యాంగ్ రేప్), సెక్ష‌న్ 354 (లైంగిక వేధింపులు), సెక్ష‌న్ 506 (బెదిరింపులు)ల‌తో పాటు పోక్సో చ‌ట్టం కింద కూడా కేసు న‌మోదు చేసి విచార‌ణ చేస్తున్నారు.

పంక్చ‌ర్ల షాపులో ప‌ని…..

గ‌తంలో ఢిల్లీలో జెజె కాల‌నీలో పంక్చ‌ర్ల షాపులో ప‌నిచేస్తుండేవాడు ఈ బాబా. ఆ త‌ర్వాత కొంత కాలం పాటు డ్రై క్లీనింగ్ వ్యాపారం కూడా చేశాడు. అక్క‌డ ప‌రిచ‌యం అయిన కొంద‌రు బాబాల ద్వారా తాను కూడా అవ‌తారం మార్చాడు. వేలాది మంది భ‌క్తుల‌ను సంపాదించాడు.

NEWS UPDATES

CINEMA UPDATES