ఆసియాకప్ క్రికెట్ కింగ్ టీమిండియా

1244
  • 1984 నుంచి ఆసియాకప్ క్రికెట్ సమరం
  • 13 ఆసియాకప్ టోర్నీల్లో ఆరుసార్లు విజేత టీమిండియా
  • వన్డే క్రికెట్ రెండో ర్యాంకర్ టీమిండియా

గల్ఫ్ దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా…2018 ఆసియాకప్ క్రికెట్ సమరానికి రంగం సిద్ధమయ్యింది. సెప్టెంబర్ 15 నుంచి రెండువారాలపాటు సాగే ఈ గ్రూప్ లీగ్ కమ్ సూపర్ ఫోర్ నాకౌట్ సమరంలో…ఆరుదేశాలజట్లు ఢీ కొనబోతున్నాయి. ఈ సందర్భంగా…మూడున్నర దశాబ్దాల ఆసియాకప్ క్రికెట్ రికార్డులు ఓసారి చూద్దాం….

ఎమిరేట్స్ లో మూడోసారి….

ఆసియాదేశాల క్రికెట్ సమరం…2018 ఆసియాకప్ కు గల్ఫ్ దేశం…యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సకలహంగులతో ముస్తాబయ్యింది. 1984 లో యూఏఈ వేదికగానే శ్రీకారం చుట్టుకొన్న ఆసియాకప్…. గత 36 సంవత్సరాల కాలంలో మరోసారి…. అదే అరబ్ ఎమిరేట్స్ కు చేరింది.

ఆసియాక్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగే ఈటోర్నీ…మూడున్నర దశాబ్దాల చరిత్రలో అత్యధికంగా…ఆరుసార్లు విజేతగా నిలిచిన ఏకైకజట్టు భారత్ మాత్రమే.

ఆరుసార్లు విజేత భారత్

ఇప్పటికే రెండుసార్లు ప్రపంచ విజేతగా ఉన్న భారతజట్టు 1984 ప్రారంభ ఆసియాకప్ నుంచి….2016లో ముగిసిన 13వ ఆసియాకప్ వరకూ ఆరుసార్లు ట్రోఫీ అందుకొంటే… ఐదుటైటిల్స్ తో శ్రీలంక రెండు, రెండు ఆసియాకప్ ట్రోఫీలతో పాకిస్థాన్ మూడుస్థానాల్లో నిలిచాయి.

భారతజట్టు..1984, 1988, 1990, 1995, 2008, 2016 సంవత్సరాలలో ఆసియాకప్ విజేతగా నిలిచింది. యూఏఈ వేదికగా జరుగుతున్న ప్రస్తుత టోర్నీలో సైతం… టీమిండియానే హాట్ ఫేవరెట్ గా, డిఫెండింగ్ చాంపియన్ హోదాలో టైటిల్ వేటకు సిద్ధమయ్యింది.

ప్రస్తుత ఆసియాకప్ లో పాల్గొంటున్న జట్లలో టీమిండియానే రెండోర్యాంక్ తో అత్యంత బలమైన జట్టుగా కనిపిస్తోంది. పాకిస్థాన్ ఐదు, బంగ్లాదేశ్ ఏడు, శ్రీలంక ఎనిమిది, అప్ఘనిస్థాన్ పది ర్యాంకులతో తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నాయి.

గ్రూప్-ఏ లీగ్ లో భారత్ పోటీ

స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా…. తొలిదశ గ్రూప్ -ఏ లీగ్ లో …హంకాంగ్, పాకిస్థాన్ జట్లతో పోటీపడుతుంది. సెప్టెంబర్ 18న హాంకాంగ్ తో టీమిండియా తన ప్రారంభమ్యాచ్ ఆడుతుంది.

సెప్టెంబర్ 19న జరిగే సూపర్ డూపర్ ఫైట్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో టీమిండియా తలపడుతుంది. సెప్బెంబర్ 28న జరిగే ఫైనల్స్ తో ఈ టోర్నీకి తెరపడనుంది.

భారత కాలమాన ప్రకారం…ఈ మ్యాచ్ లు ఆయా తేదీలలో సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతాయి.

NEWS UPDATES

CINEMA UPDATES