నీది ఏ పార్టీ బాసు… ఫిరాయింపు ఎమ్మెల్యేకు జనం చుక్కలు

2251

అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషాకు ఇబ్బందులు తప్పడం లేదు. వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన అత్తార్‌ చాంద్ బాషాను జనం మరోసారి నిలదీశారు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా తలపుల మండలం నూతనకాల్వ పంచాయతీలో పర్యటించేందుకు ఎమ్మెల్యే వచ్చారు. అయితే జనం అసలు నీది ఏ పార్టీ అంటూ నిలదీశారు.

ఏ పార్టీ తరపున టీడీపీకి ప్రచారం చేస్తున్నావ్ అంటూ నిలదీశారు. కంగుతిన్న ఎమ్మెల్యే గతంలో గ్రామానికి వచ్చినప్పుడు బాగానే స్వాగతం పలికారు కదా.. కొత్తగా ఇప్పుడేమైందని ప్రశ్నించారు. మేమంతా వైసీపీకి ఓట్లేస్తే నీవు గెలిచావని.. కానీ తమను మోసం చేసి డబ్బు కోసం టీడీపీలో చేరడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నించారు. అభివృద్ధి కోసం పార్టీ ఫిరాయించామని చెబుతున్నారని.. మరి ఇప్పటి వరకు ఏం అభివృద్ధి చేశావని నిలదీశారు.

వైసీపీ ఎమ్మెల్యేగా ఉంటూ ఇంటింటికి టీడీపీ అంటూ జనంలోకి రావడం తప్పుగా అనిపించలేదా అని నిలదీశారు. ఎమ్మెల్యే ఏ పార్టీ తరపున వచ్చారంటూ మహిళలు,పిల్లలు కూడా నినాదాలు చేశారు. దీంతో ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌ బాషా నోట మాట రాలేదు. సైలెంట్‌గా అక్కడి నుంచి జారుకున్నారు.

ఆ పక్కనే ఉన్న బైగారిపల్లె గ్రామానికి వెళ్లగా అక్కడ కూడా ఎమ్మెల్యేను జనం నిలదీశారు. ఎందుకొచ్చారంటూ ప్రశ్నించారు. మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేల సంగతి ఎలా ఉన్నా.. అత్తార్‌కు మాత్రం పదేపదే జనం నుంచి షాక్‌లు తగులుతున్నాయి.

కదిరి నుంచి మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన అత్తార్ చాంద్ బాషా 30 కోట్లు తీసుకుని టీడీపీలో చేరారని అప్పట్లో వార్తలొచ్చాయి.

NEWS UPDATES

CINEMA UPDATES