మంకీ గాడ్ గా మారిన సల్మాన్ ఖాన్

189

మంకీ కింగ్ అనే సినిమా ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయింది. అదే ప్రాసలో మంకీ గాడ్ అనే పేరు పెడితే సినిమా హిట్ అయిపోతుందని భావించారేమో. సల్మాన్ కొత్త సినిమాకు ఈ పద ప్రయోగం చేశారు. సల్మాన్ నటించిన భజరంగీ భాయ్ జాన్ సినిమా ఇండియాలో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా చైనాలో రిలీజ్ కు రెడీ అయింది. చైనా వెర్షన్ లో ఈ మూవీకి “లిటిల్ లోలిత, మంకీ గాడ్ అంకుల్” అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

నిజానికి ఈ టైటిల్ కు సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. సినిమాలో నటించిన చిన్నారి పేరు లోలిత కాదు, కానీ చైనా డబ్బింగ్ లో మున్నీ క్యారెక్టర్ ను లోలితగా మార్చేశారు. ఇక మంకీగాడ్ అంకుల్ అనే పదంతో కూడా సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం చైనీయుల్ని ఆకర్షించాలనే ఉద్దేశంతోనే ఈ పేరుపెట్టారు.

ప్రపంచ సినీ రంగంలో చైనా మార్కెట్ చాలా పెద్దది. చైనాలో ఓ సినిమా విడుదలైందంటే టాక్ తో సంబంధం లేకుండా వసూళ్ల వర్షం కురుస్తుంది. ఆ దేశ జనాభా ఎంత ఎక్కువగా ఉండడంతో పాటు… ఇండియన్ సినిమాకు చైనాలో ఉన్న క్రేజ్ కూడా దీనికి కారణం. అమీర్ నటించిన దంగల్ సినిమా చైనాలో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడా రికార్డును మంకీ గాడ్ అలియాస్ సల్మాన్ క్రాస్ చేస్తాడేమో చూడాలి

NEWS UPDATES

CINEMA UPDATES