బాల్‌థాక‌రే ను ఆయన కుటుంబ సభ్యులే నిర్లక్ష్యం చేశారు

487

మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి నారాయ‌ణ్ రాణే….శివ‌సేన అధ్య‌క్షుడు ఉద్ధ‌వ్ థాక‌రేకు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. దివంగ‌త శివ‌సేన అధినేత‌ బాల్‌థాక‌రే ను తాను ఎంతో బాధ‌పెట్టాన‌ని ఉద్ధ‌వ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను నారాయ‌ణ రాణే ఖండించారు. ఉద్ధవ్ థాక‌రే నోరు మూసుకోవాల‌ని లేక‌పోతే ఆయ‌న బండారం బ‌య‌ట పెడ‌తాన‌ని రాణా హెచ్చ‌రించారు.

బాలా సాహెబ్‌ను ఉద్ధ‌వ్ థాక‌రేతో పాటు ఆయ‌న కుటుంబీకులు ఏవిధంగా వ్య‌ధ‌కు గురిచేశారో త‌న క‌ళ్ల‌తో తాను చూశాన‌ని నారాయ‌ణ్ రాణే తెలిపారు. ఆయ‌న స్వ‌గృహం మాతృశ్రీలో బాల్‌థాక‌రే ఏ విధంగా అవ‌మానాలు ఎదుర్కొన్నారో త‌న‌కు తెలుస‌ని రాణా అన్నారు.

విభేదాల‌కు కార‌ణాలివే…

శివ‌సేన అధినేత బాల్‌థాక‌రే 1999లో నారాయ‌ణ్ రాణేను మహారాష్ట్ర ముఖ్య‌మంత్రిని చేశారు. ముఖ్య‌మంత్రిగా ఓ వెలుగు వెలిగిన రాణా ఆ త‌ర్వాత కాలంలో శివ‌సేన‌కు దూర‌మ‌య్యారు. ఉద్ధ‌వ్ థాక‌రేతో విభేదాల కార‌ణంగా 2005లో పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. అప్ప‌టి నుంచి ఇద్ద‌రికీ మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తోంది.

గ‌త ఏడాదిలో నారాయ‌ణ్ రాణే సొంత‌గా మ‌హారాష్ట్ర స్వాభిమాన్ పార్టీని స్థాపించారు. రాష్ట్రంలోను, కేంద్రంలోను బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. బిజేపితో కుదుర్చుకున్న ఒప్పందం ప్ర‌కారం రాణేను లెజిస్లేటివ్ కౌన్సిల్ స‌భ్యునిగా నియమించాల‌ని అనుకున్నారు. కానీ రాణాకు ఎదురుదెబ్బ త‌గిలింది. బిజెపి ప్ర‌సాద్ లాద్ అనే అభ్య‌ర్ధిని తెర‌పైకి తెచ్చింది. ఉప ఎన్నిక‌ల్లో గెలిపించింది. ఈ ప‌రిణామాలు రాణాకు కోపం తెప్పించాయి. దీనంత‌టికీ కార‌ణం ఉద్ద‌వ్ థాక‌రే అని భావించిన రాణా ఆయ‌నపై విరుచుకుప‌డ్డారు.

NEWS UPDATES

CINEMA UPDATES