అక్కినేని విందుకు రాని బాల‌య్య‌? కార‌ణ‌మేంటి?

969

నాగ చైతన్య- సమంతల వెడ్డింగ్ రిసెప్షన్ ఆదివారం రాత్రి వైభ‌వంగా జ‌రిగింది. హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో జ‌రిగిన రిసెప్ష‌న్‌లో సినీ,రాజ‌కీయ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీసభ్యులతోపాటు పలువురు సెలబ్రిటీల సమక్షంలో గ్రాండ్‌గా నిర్వహించారు నాగార్జున. బ్లూ కలర్ సూట్‌లో చైతూ.. రిసెప్షన్ కోసం సెపరేట్‌గా డిజైన్ చేసిన లాంగ్ డ్రెస్‌లో సమంత మెరిసి పోయింది. చిరంజీవి, రామ్‌చరణ్, కృష్ణ దంపతులు, పూజాహెగ్డే, జయసుధ, నరేష్, నాని, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.

వీరితో పాటు నంద‌మూరి కుటుంబం నుంచి చాలా మంది వ‌చ్చారు. ముఖ్యంగా హరికృష్ణ‌, జ‌య‌కృష్ణ‌,రామ‌కృష్ణ హాజ‌రయ్యారు. అయితే నంద‌మూరి బాల‌కృష్ణ మాత్రం రాలేదు. ఈ విష‌య‌మే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అక్కినేని వారి కుటుంబంతో బాల‌య్య‌కు విభేదాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. గ‌తంలో ఉన్న విభేదాలు ఆ మ‌ధ్య పెరిగిపోయాయి. ఇద్ద‌రు నిర్మాతలు ఈ స‌మ‌స్యను ప‌రిష్క‌రించేందుకు చొర‌వ చూపారు. కానీ బాల‌య్య మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. దీంతో అప్ప‌టి నుంచి అక్కినేని వారి పంక్ష‌న్‌కు బాల‌య్య రావ‌డం లేదు. ఇటు త‌న ఇంట్లో జ‌రిగే వేడుక‌ల‌కు కూడా నాగార్జున ఫ్యామిలీని పిల‌వ‌డం లేదు. ఇది మ‌రోసారి నిజ‌మైంది.

NEWS UPDATES

CINEMA UPDATES