సిక్వెల్స్ పై మనసుపడ్డ బాలకృష్ణ

200

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో “జై సింహ” అనే మూవీ లో నటిస్తున్నాడు. ఈ మూవీ లో నయనతార ఇంకా హరి ప్రియ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ టైంలో రైటర్ చిన్ని కృష్ణ వచ్చి “నరసింహానాయుడు” సీక్వెల్ కథ చెప్పాడట. కథ నచ్చిన బాలకృష్ణ వెంటనే సీక్వెల్ పనులు స్టార్ట్ చేద్దాం అని చిన్నికృష్ణ తో చెప్పాడు అని తెలుస్తుంది. నందమూరి బాలకృష్ణ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా మూవీ “నరసింహనాయుడు”. బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఎన్నో రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ వస్తుంది అని తెలియగానే నందమూరి ఫాన్స్ అందరూ పండగ చేసుకుంటున్నారు.

అయితే ఈ మూవీ సీక్వెల్ తో పాటు బాలకృష్ణ మరో రెండు రీమేక్ స్టోరీస్ కి ఓకే చెప్పాడు. “లక్ష్మి నరసింహ” సీక్వెల్ కి అలాగే “ఆదిత్య 369” సీక్వెల్ ని నందమూరి బాలకృష్ణ ఓకే చెప్పాడు. మరి ఈ మూడు సిక్వేల్స్ లో నందమూరి బాలకృష్ణ ఏ సీక్వెల్ కథని ముందు స్టార్ట్ చేస్తాడో వేచి చూడాలి. ఇకపోతే బాలయ్య రీసెంట్ మూవీ అయిన “జై సింహా” వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానుంది.

NEWS UPDATES

CINEMA UPDATES