పవన్ కళ్యాణ్ ని బాలకృష్ణ తట్టుకోగలడా?

512

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ “అజ్ఞాతవాసి”. పవన్ కళ్యాణ్ గత చిత్రాలు అయిన “సర్దార్ గబ్బర్ సింగ్” “కాటమరాయుడు” డిజాస్టర్లయినప్పటికీ “అజ్ఞాతవాసి” పై ఆ ప్రభావం ఏమీ పడలేదు. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే ఈ మూవీ పై అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ సాంగ్, ఫస్ట్ లుక్, కొన్ని ఫొటోలు రిలీజయ్యాక మూవీ హైప్ మరింత పెరిగిపోయింది. అయితే ఇన్ని అంచనాలు ఉన్న “అజ్ఞాతవాసి” మూవీ సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతుంది.

ఇక సంక్రాంతి టైం కి పవన్ కళ్యాణ్ హంగామా మాములుగా ఉండదు అని అర్ధం అయిపోతుంది. అయితే సంక్రాంతికి బాలయ్య బాబు తన 102 వ సినిమా అయిన “జై సింహ” ని కూడా రిలీజ్ చేస్తున్నాడు. ఈ సినిమాపై పెద్దగా అంచనాల్లేవు. కె.ఎస్.రవికుమార్ లాంటి ఫామ్‌లో లేని సీనియర్ డైరెక్టర్‌ తీస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఏవీ కూడా అంతా ఎగ్జైట్ కలిగించట్లేదు. ఈ సినిమాకు కథ అందించిన రత్నం కూడా ఇప్పుడు ఫాంలో లేడు.

మరి ఇన్ని నెగటివ్ పాయింట్స్ ఉన్న బాలయ్య సినిమా పవన్ కళ్యాణ్ సినిమా ముందు తట్టుకోగలదా అనే సందేహం కలుగుతుంది ఇప్పుడు. కనీసం బాలయ్య సినిమాకి థియేటర్స్ అయినా దొరుకుతాయో లేదో ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి బాలయ్య ఈ సంక్రాతికి పవన్ కళ్యాణ్ ని ఎలా తట్టుకుంటాడో వేచి చూడాలి.

NEWS UPDATES

CINEMA UPDATES