సొరంగం త‌వ్వి బ్యాంకును దోచేశారు

422

ప‌క్కా సినిమా స్కెచ్‌. అక్క‌డెక్క‌డో మెక్సికోలో ఇంత‌కుముందు ఇలాగే సొరంగం త‌వ్వి జైలు నుంచి డ్ర‌గ్ మాఫియా డాన్ ప‌రార‌య్యాడు. ఇప్పుడు అదే త‌ర‌హాలో ముంబైలో ఓ దోపిడీ దొంగల ముఠా సొరంగం త‌వ్వి బ్యాంకును దోచేసింది. రెండు నెల‌ల నుంచి ఈ సొరంగం త‌వ్వి దొంగ‌లు ఈ దోపిడీ ప్లాన్ చేశారట‌. బ్యాంకు ఉన్న బిల్డింగ్‌లోనే దుకాణం రెంట్‌కు తీసుకున్న దుండ‌గులు…40 అడుగుల సొరంగం త‌వ్వి బ్యాంకును దోచేశారు. బ్యాంకులోని 30లాక‌ర్ల‌ను ప‌గుల‌గొట్టి కోటిన్న‌ర‌కు పైగా లూటీ చేశారు. ముంబయి సమీపంలో జునైనగర్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్రాంచిలో ఈ ఘటన జరిగింది.

బ్యాంకుకు శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో ఈ దోపిడీ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దోపిడీకి ఐదు నెలల కిందటే దోపిడీ దొంగలు పథకం వేశారని, బ్యాంకు పక్కనే ఒక షాపును అద్దెకు తీసుకున్నారన్నారని, అక్కడి నుండి సుమారు 40 అడుగుల పొడవున సొరంగాన్ని తవ్వి దోపిడీకి పాల్పడ్డారని ముంబై పోలీస్‌ కమిషనర్‌ పేర్కొన్నారు.. సోమవారం ఉదయం బ్యాంకుకు వచ్చిన అధికారులు 30 లాకర్లు తెరిచి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారని అన్నారు. సిసిటివి పుటేజీల ఆధారంగా నేరస్తులను పట్టుకుంటామన్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES