సంక్రాంతి బరి లో “భరత్ అను నేను” ?

382

సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న మూవీ “భరత్ అను నేను”. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ ని వచ్చే ఏడాది ఏప్రిల్ 27 న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు మూవీ యూనిట్. కాని ఇప్పుడు ఆ డేట్ కి కూడా మూవీ రావట్లేదట. ఎందుకంటే అప్పటికే అల్లు అర్జున్ “నా పేరు సూర్య…నా ఇళ్ళు ఇండియా” మూవీని ఇదే డేట్ కి రిలీజ్ చేస్తుండటంతో రిలీజ్ డేట్ విషయంలో మహేష్ మూవీ మేకర్స్ ఆ రిలీజ్ డేట్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారట.

దీంతో అభిమానులను సర్ ప్రైజ్ చేసేందుకు గాను కొంచెం ముందుగానే వచ్చేద్దామని మహేష్ బాబు ప్లాన్ చేసుకుంటున్నాడట. అవును సంక్రాంతి నాటికే “భరత్ అను నేను” మూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ రిలీజ్ డేట్ గురించి మహేష్ బాబు మూవీ ప్రొడ్యూసర్స్ తో డిస్కషన్స్ జరిపినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ మూవీ ని ప్రారంభించినపుడు సంక్రాంతికే అనుకున్నారు. అందుకు తగినట్లుగానే షెడ్యూల్స్ కూడా ప్లాన్ చేశారు. “స్పైడర్” మూవీ కారణంగా కొన్ని షెడ్యూల్స్ తేడా వచ్చాయి. కానీ వీటిని కవర్ చేసేలా మహేష్ డేట్స్ కేటాయించాడట. వీలైతే సంక్రాంతికి లేదా రిపబ్లిక్ డే రోజు తన మూవీ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడట మహేష్.

NEWS UPDATES

CINEMA UPDATES