హైకోర్టు నా వెంట్రుకతో సమానం….

1770

న్యాయస్థానాలంటే ఇటీవల నాయకులకు చులకన భావం ఏర్పడింది. కోర్టులను ఏమాత్రం లెక్కచేయడం లేదు. కోర్టులకు తాము అతీతులం అని భావించే నేతలు పెరుగుతున్నారు.

తమిళనాడులో బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్‌. రాజా ఏకంగా హైకోర్టును తన వెంట్రుకతో సమానం అని వ్యాఖ్యానించారు. పుదుకోట జిల్లా తిరుమయం వద్ద వినాయక నిమజ్జన ఊరేగింపును పోలీసులు అడ్డుకున్నారు.

ఇతర మతాల ప్రార్థనామందిరాలు ఉన్న మార్గంలో నిమజ్జన ఊరేగింపు వద్దని కోర్టు చెప్పిందని అడ్డుకున్నారు. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్‌. రాజా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు లంచాలకు మరిగారని… ఏకంగా డీజీపీ ఇంట్లోనే సీబీఐ దాడులు జరిగినా పోలీసులకు సిగ్గురాలేదని వ్యాఖ్యానించారు.

హైకోర్టు తీర్పు గురించి పోలీసు అధికారులు వివరించబోగా మరింత రెచ్చిపోయారు బీజేపీ నేత. హైకోర్టు తన వెంట్రుకతో సమానమని వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పు మట్టితో సమానమంటూ ఊగిపోయారు.

NEWS UPDATES

CINEMA UPDATES