విడాకుల‌కు కొంత టైమ్ ప‌ట్ట‌వచ్చు!

659

తెలుగుదేశం పార్టీకి – భార‌తీయ జ‌న‌తా పార్టీకి మ‌ధ్య స‌ఖ్య‌త లేద‌ని నేరుగా అన‌డం లేదు. కానీ విడాకుల ప్ర‌స్తావ‌న తెర మీద‌కు వ‌స్తోంది. అయితే బాబు బిజెపితో ఇప్పుడే తెగ‌తెంపులు చేసుకోర‌ని అందుకు మ‌రో ఏడాది టైమ్ తీసుకుంటార‌ని ఆ పార్టీ శ్రేణులు, జాతీయ మీడియా సంస్థ‌ల అంచ‌నా. వారి అంచ‌నా ప్ర‌కారం బిజెపికి రామ్‌రామ్ చెప్ప‌డం ఇప్ప‌ట్లో కాదు, కానీ అది ఎప్పుడో ఒక‌ప్పుడు ఉంటుంది. చంద్ర‌బాబు తొంద‌ర‌ప‌డ‌కుండా రాజ‌కీయ అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్నాడ‌ని ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు చెప్తున్నారు. ఈ లోపు ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో ఒడంబ‌డిక కుదుర్చుకోవ‌డం పూర్తి చేస్తార‌ని కూడా పార్టీ వ‌ర్గాల భోగ‌ట్టా. ప‌నిలో ప‌నిగా ఈ టైమ్ గ్యాప్‌లో బిజెపితో పొత్తు వ‌ల్ల రాష్ట్రం న‌ష్ట‌పోయింద‌నే అభిప్రాయాన్ని క‌లిగించాల‌ని కూడా సూచ‌న ప్రాయంగా సంకేతాలందాయట‌. అందుకు పోల‌వ‌రాన్ని ఉదాహ‌ర‌ణ‌గా చూపించాల‌ని మంత్రులు, ఎమ్మెల్యేల‌కు శిక్ష‌ణ‌నిస్తున్నారు. పోల‌వ‌రం నిర్మాణంలో వైఫ‌ల్యం త‌మ ప్ర‌భుత్వం మీద‌కు రాకుండా బిజెపి మీద‌కు తోయ‌డానికి రంగం సిద్ధ‌మైంద‌ని స‌మాచారం.

నోరు విప్ప‌ని బిజెపి!

రాష్ట్రంలో పొత్తుపెట్టుకున్న స్థానిక‌ పార్టీ వ్యూహం ఇలా ఉంటే… బిజెపి రాష్ట్ర నాయ‌క‌త్వం మాత్రం నోరు విప్ప‌డం లేదు. నిజానికి బిజెపి జాతీయ స్థాయి నాయ‌క‌త్వానికి, రాష్ట్ర స్థాయి నాయ‌క‌త్వానికి కూడా టీడీపితో పొత్తు కొనసాగించాల‌ని ఏ మాత్రం లేద‌ని అనేక సంద‌ర్భాల‌లో రుజువైంది. కానీ ఆ పొత్తు అలా కొన‌సాగుతోంది. పోల‌వ‌రం విష‌యంలో కానీ, అమ‌రావ‌తి నిర్మాణం విష‌యంలో కాని కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు మ‌ధ్య దూరం పెర‌గ‌డ‌నికి దారి తీసిన కార‌ణాల‌ను విశ్లేషించ‌డంలో ఆ పార్టీ వైఫ‌ల్యం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది.

ఇక చంద్ర‌బాబు మాత్రం… ఎన్డీఎతో పొత్తు మీద ఇప్పుడే ఎక్క‌డా మాట్లాడ‌వ‌ద్ద‌ని గ‌ట్టిగానే హెచ్చరించారట‌. ఆ హెచ్చ‌రిక‌ల‌ను ఆ పార్టీ నాయ‌కుల కంటే బిజెపి నాయ‌కులే జాగ్ర‌త్త‌గా పాటిస్తున్నారు. ఏదో ఒక లీక్ టిడిపి నాయ‌కుల నుంచి వ‌స్తోంది త‌ప్ప బిజెపి నాయ‌కుల నుంచి ఏ మాత్రం రావ‌డం లేదు. పైగా కొంద‌రు బిజెపి నాయ‌కులు చంద్ర‌బాబు మీద ఈగ వాల‌నివ్వ‌డం లేదు.

NEWS UPDATES

CINEMA UPDATES