“బొమ్మరిల్లు” దర్శకుడి పిల్లల సినిమా

288

“బొమ్మరిలు” లాంటి క్లాసిక్ మూవీ తో దర్శకుడిగా పరిచయం అయిన భాస్కర్ తెలుగు ఇండస్ట్రీ లో ఒక వెలుగు వేలుగుతాడు అనుకున్నారు అంతా. కాని తన తరువాత మూవీ అయిన “పరుగు” పెద్దగా ఆడకపోవడంతో చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని రామ్ తో “ఒంగోలు గిత్త” అనే మూవీ తీసాడు. ఈ మూవీ కూడా ఫ్లాప్ అవ్వడం తో దాదాపు నాలుగేళ్ళ గ్యాప్ తీసుకొని తమిళంలో “బెంగళూరు డేస్” రీమేక్ ని తీసాడు. ఈ మూవీ కూడా అతడికి దారుణమైన ఫలితాన్నందించింది. కొన్నేళ్లుగా అసలు హైదరాబాద్ లో కనిపించని భాస్కర్ ప్రస్తుతం హైదరబాద్ లో జరుగుతున్న చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తాను బాలల చిత్రం తీయబోతున్నట్లు భాస్కర్ చెప్పడం విశేషం.

‘‘అమీర్ ఖాన్ తీసిన ‘తారే జమీన్ పర్’ లాంటి సినిమా చేయాలని నాకు ఎప్పట్నుంచో బలమైన కోరిక ఉంది. కొన్నేళ్లుగా నన్ను ఓ కథ వెంటాడుతోంది. పిల్లల మీద తీయబోయే సినిమా అది. ఆ కథను సినిమాగా తీస్తే అద్భుతంగా ఉంటుంది. కచ్చితంగా ఆ సినిమా చేసి తీరుతా. అది ఎప్పుడన్నది కచ్చితంగా చెప్పలేను. దీంతో పాటు నా తర్వాతి సినిమాకు ఓ కథ సిద్ధం చేస్తున్నా. నేను దేశంలో ఎక్కడ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ జరిగినా కచ్చితంగా హాజరవుతాను. ఇక్కడ మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.అయితే హైదరాబాద్ లో జరిగే చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ కు ఇండస్ట్రీ నుంచి పెద్దగా జనాలు రాకపోవడం నిరాశ కలిగిస్తోంది’’ అని భాస్కర్ చెప్పాడు.

NEWS UPDATES

CINEMA UPDATES