సీకే బాబు చేరికకు ముహూర్తం ఖరారు

1365

చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే జయచంద్రారెడ్డి(సీకే బాబు) బీజేపీలో చేరుతున్నారు. ఈనెల ఏడున ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. గురువారం సీకే బాబు బెంగళూరులో అమిత్ షాను కలిశారు. విజయవాడలో కంభంపాటి హరిబాబు సమక్షంలో ఆయన బీజేపీలో చేరుతారు. కాంగ్రెస్‌ దెబ్బతినిపోయిన తర్వాత ఆయన ఇండిపెండెంట్‌గా రాజకీయాలు నడిపేందుకు ప్రయత్నించారు. మూడేళ్లుగా రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల వైసీపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా వైఎస్‌ వర్థంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో వైసీపీ ఇన్‌చార్జ్‌పై సీకే బాబు భార్య కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో సీకే బాబు కుటుంబంతో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES