Friday, June 22, 2018

నిధి

ఒక వ్యాపారస్థుడు ఎంతో కష్టపడి ఎన్నో రకాలయిన వ్యాపారాలు చేసి బాగా ధనం కూడబెట్టాడు. అతనికి నలుగురు కొడుకులు. నలుగురూ అసమర్ధులు. వ్యాపారంలో తండ్రికి సాయపడడానికి బదులు తండ్రి సంపాదించిన ధనాన్ని విచ్చలవిడిగా...

నీకు సగం – నాకు సగం

ఒక ఆరితేరిన దొంగ ఉండేవాడు. దొంగతనాన్ని మనవాళ్ళు అరవైనాలుగు కళల్లో ఒకటిగా చేర్చారు. ఆ కళలో అతను ఆరితేరినవాడు. సునాయాసంగా పెద్దపెద్ద దొంగతనాలు చేసేవాడు. అతనికి దయాదాక్షిణ్యాలుండేవి కావు. కఠినంగా తయారయ్యాడు. అతనికి...

పదవ అంతస్థు

ఒక గొప్ప వ్యాపారస్థుడుండేవాడు. అతను ఎన్నో రకాలయిన వ్యాపారాలు చేసి కోటానుకోట్లు గడించాడు. అతనితో పోటీ పడగలిగిన ధనవంతులు ఎవరూ లేకపోయారు. ఆ వ్యాపారికి ఒక ఆలోచన వచ్చింది. లోకమంతా తనను చూసి...

భర్త భార్య అయితే

ప్రపంచంలో కృతజ్ఞత అన్నది అపురూపమయింది. అది సాయం చెయ్యడంలో, ఆదుకోవడంలో, చిరునవ్వు నవ్వడంలో ఇలా ఎన్ని రూపాల్లోనో ఉంటుంది. అది మిత్రులపట్ల కావచ్చు, కుటుంబంలోని వ్యక్తుల పట్ల కావచ్చు, అపరిచితులపట్ల కావచ్చు. మనం...

దూరదృష్టి

ఆ గ్రామం ఎంతో ప్రశాంతంగా ఉండేది. పట్టణానికి దూరంగా ఉండేది. గ్రామం చుట్టూ మొక్కజొన్న చేలు. పిట్టల కిచకిచలు. ఆ గ్రామస్థులు పంటలు పండించుకుంటూ నాగరిక ప్రపంచానికి దూరంగా నిర్మలమయిన జీవితాన్ని గడిపేవారు. ఒక...

వెంట వచ్చేవి

ఒక వ్యాపారస్థుడు పరమలోభి. కాకికి కూడా చెయ్యి విదల్చని వాడు. ఇవ్వడమే తప్పని, తీసుకోవడమే ఒప్పని భావించే రకం. ఎప్పుడూ మాసిన బట్టలు వేసుకునేవాడు. సరయిన తిండి తినేవాడు కాదు. అతనికి స్నేహితులెవరూ...

ఎవరి సేవకుడు?

ఒక రాజు ఉండేవాడు. అతని దగ్గర ఎంతో వివేకవంతుడయిన మంత్రి ఉండేవాడు. అన్ని వేళలా ఆ మంత్రి రాజుకు మంచి సలహాలనిచ్చి పరిపాలన సవ్యంగా సాగేలా సహకరించేవాడు. రాజు కూడా తెలివయిన వాడే....

ఎందుకూ పనికి రానిది

ఒక సన్యాసి ఒక పర్వతం మొదట్లో ఉన్న చిన్ని గుహను నివాసంగా చేసుకుని ఆత్మజ్ఞానంకోసం అహర్నిశలు తపస్సు చేశాడు. అడవిలోని కందమూలాలు తింటూ సమీపంలోని సెలయేటి నీళ్ళు తాగుతూ నిరాడంబర జీవనం సాగించేవాడు. నిరంతర...

ఆశ‌ల‌న్నీ శ్వాసతోటే

`ఆ ఎదురుగుండా ఇంట్లో కుర్రాడు పోయాడ‌మ్మా` వ‌చ్చీరాగానే ఉద్వేగంగా ఆనాటి ఎజెండాని ప్రవేశ‌పెట్టింది మా ప‌నిమ‌నిషి ప‌ద్మ. కంప్యూట‌ర్ ముందు ప‌నిచేసుకుంటున్నవాడిన‌ల్లా, నా వినికిడి శ‌క్తినంతా జ‌రుగుతున్న సంవాదం మీద‌కి  మ‌ళ్లించాను. మ‌న‌కి...

పరిశీలకుడు

మనం అన్నిటిపట్ల సాక్షిగా ఉండగలగాలి. నిత్య స్పృహతో, నిత్యచైతన్యంతో, నిరంతర సాధనతో అది సాధ్యం. సంఘటనలన్నవి, సన్నివేశాలన్నవి రాగద్వేషాల వల్ల ఏర్పడతాయి. రాగద్వేషాలు లేనపుడు నిశ్చలత్వం ఉంటుంది. దాన్ని నిరామయమనండి, నిరంజనత్వమనండి శూన్యమనండి....

“బామతి”

ఒక గొప్ప పనివెనక కేవలం ఒక వ్యక్తి శ్రమ మాత్రమే ఉండదు. పేరుమాత్రం ఆ పనిని నిర్వహించిన ఆ వ్యక్తికే వస్తుంది. గొప్ప ఆవిష్కారాలు చేసిన వారికి పేరు ప్రతిష్టలు వస్తాయి. ప్రత్యక్షంగా,...

చూపు

కళ్ళున్న వాళ్ళు చూస్తారు. కళ్ళు లేనివాళ్ళు చూడరు. ఇది సాధారణంగా అందరూ అనుకునే విషయం. కానీ అందరూ అన్నీ చూస్తారనడానికి లేదు. మన నమ్మకాలు మనవి. దేన్ని చూడాలో దేన్ని పరిహరించాలో చూపుతాయి....

సందేశం

ఒక సూఫీ గురువు హజ్‌యాత్రకు మక్కాకు బయల్దేరాడు. అతను చాలా దూరప్రాంతంనించీ తీర్థయాత్ర చేశాడు. మార్గమధ్యంలో ఎన్నో గ్రామాలు, పట్టణాలు వచ్చాయి. ప్రతిచోటా అందరూ ఆ సూఫీ గురువును గౌరవించి ఏమయినా సందేశమివ్వమని...

కోటలు

మనం ఇతరుల ఇష్టాల్ని చూసి కొన్నిసార్లు నవ్వుకుంటాం. ఇతరుల కోర్కెల్ని చూసి అవి ఎంత అల్పమయినవి అనుకుంటాం. మన కోరికలు గొప్పవని, మన లక్ష్యాలు సాటి లేనివని విర్రవీగుతాం. ఉన్నత లక్ష్యాలని గమ్యాలని...

మాట్లాడే పుర్రె

ఒక వేటగాడు అడవికి వెళ్ళాడు. దారిలో ఒక చెట్టుకింద అతనికి ఒక పుర్రె కనిపించింది. బాగా ఎండగా ఉండడంతో విశ్రాంతి కోసం అతను చెట్టు కింద కూచున్నాడు. పక్కనే కపాలముంది. అది అక్కడ...

సలహా

ఒక రాజు తన దగ్గరున్న ఒక జ్ఞానిని పిలిచి "మీరు నాకు ఒక సలహా ఇవ్వాలి. అయితే అది కేవలం ఒక వాక్యంలో ఉండాలి. అది జీవితంలోని అన్ని సందర్భాల్లో ఉపయోగపడాలి. జీవితంలోని...

సత్యం

ఒక సూఫీ మార్మికుడు ఉండేవాడు. ఆయనపేరు అబ్రహాం. అయన్ది ప్రత్యేకమయిన వ్యక్తిత్వం. ఆయన ఇతరుల కన్నా ఎంతో భిన్నమయిన వాడు. ఆయన ప్రార్థనలు కూడా వేరుగా ఉండేవి. సాధారణంగా మనుషులు తమకున్న కష్ట నష్టాల్ని...

లాంతరు

ఇద్దరు ప్రయాణికులు ఒక దారిలో కలిశారు. ఒకతని దగ్గర లాంతరు ఉంది. ఇంకొకతని దగ్గరలేదు. కానీ ఇద్దరూ కలిసి పక్కపక్కనే నడవడం వల్ల కాంతి ఇద్దరి మార్గాల్లో పరుచుకోవడం వల్ల మార్గం సుగమంగా...

కల

హసన్‌ సూఫీ మార్మికుడు. ఆయనకు ఒక కొడుకు ఉండేవాడు. ఇరవయ్యేళ్ళవాడు. అందరికీ ఆ కుర్రవాడంటే ఎంతో ఇష్టం. అతను అందగాడు. ఆహ్లాదంగా చిరునవ్వు నవ్వేవాడు. అతన్తో మాట్లాడడమన్నా అందరికీ ఇష్టం. అతని ఆకర్షణీయమైన...

ఎర్రటి రాయి

సృష్టి విచిత్రమయింది. మనోహరమైంది. వైవిధ్యభరితమయింది. ప్రతిమనిషీ ప్రత్యేకత కలిగినవాడే. ఎవరి వ్యక్తిత్వం వారిది. ఎవర్నీ ఎవరితో పోల్చడానికి లేదు. సృష్టిలోని ఆ అనంతవైవిధ్యమే మనల్ని చైతన్యవంతుల్ని చేస్తుంది. ఆసక్తిని రేపుతుంది. ప్రతిదీ సృష్టిలో అర్థవంతమైందే. బయాజిద్‌...

గురువు

ఘజ్ఞా విజేత అయిన రాజు మహమ్మద్‌ కాలంలో హైదరాలీజాన్‌ అన్న యువకుడు ఉండేవాడు. అతని తండ్రి పేరు ఇస్కందర్‌ ఖాన్‌. అతను తన కొడుకు రాజాస్థానంలో తగిన పదవిపొందాలని ఆశించాడు. తన కొడుకుని...

అజీర్ణం

ఒక వ్యక్తి సూఫీ గురువయిన బహాయుద్దీన్‌ నష్క్‌బంద్‌ దగ్గరికి వచ్చాడు. తన అనుభవాల్ని ఆ సూఫీ గురువుకు వివరించాడు. "నేను ఒక గురువు దగ్గర్నించీ ఇంకో గురువు దగ్గరకు వెళ్ళాను. వాళ్ళు చెప్పినవన్నీ...

ఏది అదృశ్యం?

ఒక వ్యక్తి ఒక ప్రసిద్ధుడయిన సూఫీ దగ్గరకు వెళ్ళి "ఏది అదృశ్యం? కనిపించనిది అని మనం దేన్నంటామో అది ఏది?'' అని అడిగాడు. సూఫీ అతన్ని చూసి "నీ ప్రశ్నకు నేను సమాధానమిస్తాను. ఎప్పుడంటే...

పశ్చాత్తాపం

ఒక లోభి కాకికి చెయ్యి విదిలించనివాడు. కడుపుకు తినకుండా నానాకష్టాలు పడి డబ్బును బాగా కూడ బెట్టాడు. ఈ సంవత్సరమంతా కూడబెట్టి వచ్చే సంవత్సరం సుఖపడతానని అనుకునేవాడు. వచ్చే సంవత్సరం కూడా అలాగే...

కత్తెర – సూది

ఫరీద్‌ గొప్ప సూఫీ మార్మికుడు. ఒకరోజు ఆయన్ని కలవడానికి ఒకరాజు వచ్చాడు. రాజులందరూ పూర్వం సన్యాసుల్ని సందర్శించి వాళ్ళ ఆశీర్వాదం, సలహాలు తీసుకోవడం ఆనవాయితీగా ఉండేది. ఆరాజు తన స్థాయికి తగినట్లు ఫరీద్‌కు ఏదయినా...

దేవుడెక్కడున్నాడు?

మనం రకరకాల మతాల వాళ్ళను చూస్తూ ఉంటాం. మనిషిని మనిషిగా చూస్తే ఎవర్నీ ఇతను ఫలానా మతం వాడని గుర్తుపట్టలేం. పిలకలు ఉండడం, గడ్డం పెంచుకోవడం, మెడలో రుద్రాక్షలు, లేదా తాయెత్తులు, తలపాగాలు,...

ప్రపంచాన్ని మార్చడం

బయాజిద్‌ సూఫీ మార్మికుడు. ఆయన ఆత్మకథ రాసుకున్నాడు. దాంట్లో అద్భుతమయిన ఒక విషయం చెప్పాడు. అది ఆయన జీవితానికి సంబంధించిన సారాంశం. ఆయన ఇట్లా అన్నాడు. నేను యువకుడుగా ఉన్నపుడు నా ప్రార్థనలో దేవుణ్ణి ఇట్లా...

సరే చూద్దాం!

పూర్వం ఒక గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు. అతని భార్య చనిపోయింది. అతనికి ఒకడే కొడుకు. అతనికి ఉన్న ఆస్తి అంతా ఒక కొడుకు, ఒక గుర్రం. కొడుకును, గుర్రాన్ని ఎంతో ప్రేమగా...

గుడ్డి వాళ్ళు – ఏనుగు

ఒక నగరముండేది. అందులో అందరూ గుడ్డివాళ్ళే. ఒకరోజు రాజుగారు తన పరివారంతో ఆ నగరానికి దగ్గరగా ఎడారిలో గుడారాలు వేయించి విడిది చేశాడు. ఆ విషయం ఆ నగరంలోని గుడ్డి వాళ్ళకు తెలిసింది. రాజు...

కోతుల్ని పట్టడమెలా?

పూర్వం ఒక కోతి వుండేది. దానికి చెర్రిపళ్ళంటే యిష్టం. ఒకరోజు చెట్టు మీద నించి చెర్రిపండును చూసింది. చెట్టుదిగి పండు తీసుకుందామని వచ్చింది. ఆ చెర్రిపండు ఒక గాజుపాత్రలో వుంది. కోతి కొంత...

Recent Posts