Wednesday, January 29, 2020

బౌద్ధంలో ధ్యానం ప్రధానం

బౌద్ధధర్మంలో ధ్యానానికీ చాలా ప్రాధాన్యం ఉంది. ధ్యాన సాధన చేయకుండా బౌద్ధాన్ని పూర్తిగా ఆచరించడం సాధ్యంకాదు. బౌద్ధ ధర్మ ఆచరణకు అనుకూలమైన సమతా స్థితి మనసుకు కలగాలన్నా, మన మనసు స్వరూపం మనకు తెలియాలన్నా...

నేర్చుకోవడం

సోక్రటీసుకు మరణశిక్ష విధించారు. తన ఉపన్యాసాలతో యువకుల్ని నాశనం చేస్తున్నాడని అభియోగం. ఆయన్ని జైల్లో పెట్టారు. ఆ వివేకవంతుడంటే అందరికీ గౌరవం. పేరుకు జైల్లో పెట్టారు కానీ అందరూ వచ్చి ఆయన్ని చూసి...

సైకిల్‌

ఒక జెన్‌ గురువు తన దగ్గర చదువుకునే ఐదు మంది విద్యార్థులు మార్కెట్‌ నుండి సైకిళ్ళు తొక్కుకుంటూ రావడం చూశాడు. వాళ్లందరి ముఖ కవళికల్ని పరిశీలించాడు.  వాళ్లని ప్రశ్నించాలని అనిపించింది.  వాళ్లందరూ వచ్చి సైకిళ్లు...

అవసరాలు – కోరికలు

కోరికలు లెక్కలేనన్ని ఉంటాయి.  అవసరాలు కొన్నే ఉంటాయి.  అవసరాల్ని తీర్చుకోవచ్చు.  కానీ కోరికల్ని తీర్చుకోలేం.  కోరిక అన్నది పిచ్చెక్కించే అవసరం.  దాన్ని సంతృప్తి పరచడం అసంభవం.  నువ్వు వాటిని తీరుస్తూ వెళ్ళేకొద్దీ అవి...

సారిపుత్రుడు

సారిపుత్రుడు గౌతమబుద్ధుడి ప్రముఖ శిష్యుల్లో ఒకడు.  గౌతమబుద్ధుడి జీవితకాలంలో జ్ఞానోదయం పొందినవాళ్లల్లో ఒకడు. సారిపుత్రుడు మొదట గౌతమబుద్ధుడి దగ్గరకు వాదించడానికి వచ్చాడు. అప్పటికే అతను గొప్ప గురువుగా పేరు పొందాడు.  ఐదువేలమంది శిష్యులతో పటాటోపంగా...

సత్యం – అనుభవం

ఒక కట్టెలు కొట్టే వ్యక్తి రోజూ అడవికి వెళ్లి కట్టెలు కొట్టేవాడు.  ఒక్కోసారి వర్షం పడేది.  ఒక్కోసారి విపరీతంగా ఎండలు కాసేవి.  ఒక్కోసారి విపరీతంగా చలిపెట్టేది.  కాలే కడుపుతో అతను కష్టపడుతూ ఉండేవాడు. ఆ...

పరిచయంలేని స్నేహితులు

ఒక గ్రామంలో పేదవాడు ఉండేవాడు.  అతనికి ఉన్న ఆస్తి అంతా ఒక గుడిసె.  అందులో అతను, అతని భార్య ఉండేవాళ్లు.  కూలి చేసుకుని బతికేవాళ్లు.  ఆ పేదవాడు ఎంతో సౌమ్యుడు. ఆశలేనివాడు.  పైగా...

చెప్పులకు నమస్కారం!

ఒక వ్యక్తికి జీవితంలో ఎన్నో సమస్యలున్నాయి.  కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు లెక్కలేనన్ని ఉన్నాయి.  ఎక్కడా వేటికీ పరిష్కారం కనుచూపు మేరలో కనిపించలేదు.  ఎవరో పక్కఊళ్లో గొప్ప గురువులు బస చేశారని ఎందరో...

సిరియాళుడు

సిరియాళుడు "భక్త సిరియాళుడు''గా ప్రసిద్ధుడు. భక్తి సిరియాళుని ఇంటి పేరయింది. ఆ భక్తి యెవరి పట్ల? తల్లి పట్లా? తండ్రి పట్లా? దేవుని పట్లా? అతిథి దేవుని పట్లా? ఎవరిపట్ల? చిరుతొండడను వైశ్యునికి పుట్టినవాడే...

మార్కండేయుడు

ఏజీవికయినా చావు పుట్టుకలు ఉంటాయి! లేకుండా ఉండే వీలే లేదు! "పుట్టిన వారికి మరణం తప్పదు! అనివార్యమగు ఈ కార్యం గురించి శోకింపతగదు!'' అని గీత కూడా చెప్పింది! పుట్టుక తప్ప చావు...

ధ్రువుడు

ఆకాశంలో ఎన్నో నక్షత్రాలున్నా - ఉత్తర దిక్కున సప్తర్షి మండలంపైన ప్రకాశిస్తూ వెలిగే నక్షత్రమే ధ్రువ నక్షత్రం! ఎ ఎత్తైన స్థానంలో ఉన్న ధ్రువనక్షత్రం వెనుక లోతైన కథ ఉంది! తండ్రి తొడమీద...

బలి

ప్రహ్లాదుడు తెలుసుకదా? అతని నలుగురు కొడుకుల్లో ఒకడైన విరోచనుని కొడుకే బలి. ఆడిన మాట తప్పనివాడు. ఇచ్చిన మాటకు కట్టుబడిన వాడు. అందువల్ల తన ఉనికికే ప్రమాదం వచ్చినాసరే శిరసొంచనివాడు. అంతే ధర్మబద్దుడు....

నక్షత్రకుడు

"నక్షత్రకుడిలా తయారయ్యాడు'' - అని, "నక్షత్రకుడిలా వదలడంలేదు'' - అని అంటూ వుండడం విన్నారు కదా? నక్షత్రకుడు ఎవరు? విశ్వామిత్రుని శిష్యుడు. బ్రాహ్మణుడు. అంతకు మించి హరిశ్చంద్రుని వెంట పడ్డవాడు. విశ్వామిత్రునికి హరిశ్చంద్రుడు ఇవ్వవలసిన డబ్బును...

జాంబవతి

జాంబవంతుడు తెలుసు కదా? బ్రహ్మ ఆవులించగా పుట్టి భల్లూక (ఎలుగు బంటి) రాజు అయ్యాడు. అలాంటి బుద్ధిమంతుని, బలవంతుని కూతురే జాంబవతి! జాంబవతి శ్రీకృష్ణుని ఎనిమిది మంది భార్యలలో ఒకతి! జాంబవంతుడు తన కూతుర్ని అల్లారు...

శర్మిష్ఠ

రాక్షసరాజు వృషపర్వుడు. వృషపర్వుని కూతురు శర్మిష్ఠ. వారి రాజగురువు శుక్రుని కూతురు దేవయాని. శర్మిష్ఠ ఒకరోజు వన విహారానికి చెలికత్తెలతో వెళ్తూ వెళ్తూ గురుపుత్రిక అని, తన ఈడుదేనని దేవయానిని కూడా రమ్మని...

యయాతి

ఒకరి వయసు ఒకరు ఇచ్చిపుచ్చుకొనే వీలుందా? అలాంటి కథొకటి ఉంది. అదే యయాతి కథ! యయాతి చంద్ర వంశపురాజు. తల్లి ప్రియం వద. తండ్రి నహుషుడు. యయాతి ఎప్పట్లాగే ఒకరోజు వేటకు వెళ్ళాడు. అడవిలో...

దేవయాని

రాక్షస గురువు శుక్రాచార్యుని కూతురు దేవయాని. తల్లి జయంతని, ఆమె ఇంద్రుని కూతురని జానపదులు చెపుతారు. మృత సంజీవని విద్య నేర్చుకోవడానికి కచుడు వచ్చాడని తెలియక, తండ్రి దగ్గర శిష్యరికం కోరి వచ్చాడని...

కచుడు

దేవతల గురువు బృహస్పతి కొడుకు కచుడు. కచుడుని పిలిచి రాక్షస గురువైన శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి మృతసంజీవని ఎలాగైనా సాధించుకు రమ్మన్నారు. దాంతో సురలోకం వదిలి అసురలోకం చేరాడు.             మృత సంజీవని విద్య...

మోహిని

మోహనము అంటే మోహం కలిగించునది అని అర్థం. మోహిని అంటే విష్ణువు దాల్చిన సుందర రూపమని అర్థం. విష్ణువు పురుషుడైనప్పటికీ అంత అందమైన స్త్రీరూపం యెందుకు ధరించాల్సి వచ్చింది? మోహినీ అవతారమని కూడా...

రుక్మిణి

కుండిన దేశాధీశుడైన భీష్మకుని ఏకైక కూతురు రుక్మిణి. ఆమె తోడ అయిదుగురు అన్నదమ్ములు. రుక్మి, రుక్మధరుడు, రుక్మబాహువు మొదలైన వాళ్ళు. అయితే తండ్రి భీష్మకుని దగ్గరకు వచ్చీపోయే వాళ్ళ కబుర్లలో శ్రీకృష్ణుని గురించి...

శిబి

చక్రవర్తులలో శిబి చక్రవర్తికి మంచి పేరుంది. శరణు అని వచ్చిన వారికి రక్షణ యివ్వడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయనను పోలినవారు మరొకరు లేరు అనడం అతిశయోక్తి కాదు!             శిబి తల్లి పేరు...

శిశుపాలుడు

తప్పుమీద తప్పు... వరుసగా వంద తప్పులు చేసాడు శిశుపాలుడు. వందవరకు తప్పుల్ని లెక్కపెట్టి అంతవరకూ అవకాశమిచ్చాడు కృష్ణుడు. ఎందుకని? అది తెలియాలంటే శిశుపాలుని కథ తెలియాల్సిందే!        సాత్వతి దమఘోష దంపతులకు...

సుమతి

సూర్యడు ఉదయించకపోతే ఏమవుతుంది? లోకం చీకటవుతుంది! చీకటి లోకాన్ని ఊహించగలమా? కళ్ళుండీ లేనట్టే కదా? అలాంటి సందర్భం ఒకటి వచ్చింది. ఎవరు చేసారా? సుమతి! ఎందుకు చేసింది? సుమతి మహాపతివ్రత. పండితుడూ నిష్టాగరిష్టుడైన కౌశికుని...

శుక్రుడు

మృతి చెందిన వాళ్ళను తిరిగి బతికించే విద్యే మృత సంజీవనీ విద్య! అలాంటి అద్భుతమైన మృత సంజీవనీ విద్య తెలిసినవాడు శుక్రుడు. శుక్రుడు ఎవరో తెలుసా? దేవతలకు గురువు బృహస్పతి అయితే. రాక్షసులకు...

ప్రయోగం

రాజేష్‌ ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి, టిఫిన్‌ చేసి ఆఫీసుకి బయల్దేరడానికి సిద్ధపడ్డాడు. పిల్లలకు రాజేష్‌ భార్య టిఫిన్‌ క్యారియర్లు సిద్ధం చేసింది. మొదట పిల్లల ఆటో వచ్చింది. పిల్లలు ఆటోలో స్కూలుకు...

గంగ

గంగను గురించి ఒక్కోపురాణంలో ఒక్కో కథ ఉంది! వామనుడు మూడడుగుల నేల కోరి ఒక అడుగు భూమి మీద, ఒక అడుగు ఆకాశం మీద, మూడో అడుగు బలి శిరస్సు మీద ఉంచాడు కదా......

సుభద్ర

అర్జునుని భార్య సుభద్ర. అంతకన్నా ముందు రోహిణీ వసుదేవుల తనయ. శ్రీ కృష్ణునికి చెల్లి. ఆ తర్వాత అభిమన్యునికి తల్లి.             సుభద్రకు వయసొచ్చింది. అర్జునుని మీద వలపొచ్చింది. అర్జునుని యోప్పుడూ చూడలేదు. అతని...

రంభ-ఊర్వశి-మేనక-తిలోత్తమ

అందానికి అప్సరస అంటారు. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతాచి అందరూ అప్సరసలే! అసలు అప్సరసల పుట్టుక వెనుక కూడా ఒక కథ ఉంది. బ్రహ్మ పిరుదులనుండి పుట్టిన రాక్షసులు వెంటపడితే విష్ణుమూర్తి...

ద్రౌపది

పాంచాల రాజు కూతురు కాబట్టి ఆమె "పాంచాలి''. పంచ పాండవుల్ని భర్తగా పొందింది కాబట్టి "పంచ భర్తృక''. విరాట్‌రాజు కొలువులో అజ్ఞాత వాసంలో ఉన్నప్పుడు "సైరంధ్రి''. ఎవరేమని పిలిచినా ఆమె ద్రౌపది!             ద్రౌపది...

హిడింబి

హిడింబి రాక్షస జాతికి చెందిన మగువ. ఆమె అన్న హిడింబాసురుడు. అర వీర భయంకరుడు. అన్నా చెల్లెళ్ళిద్దరూ అడవిలోనే ఉండేవారు.             ఒకరోజున ఆ అన్నా చెల్లెళ్ళున్న అడవిలోకి పాండవులు వచ్చారు. లక్కయింటి ఆపదనుంచి...

Recent Posts