Friday, July 19, 2019

కీళ్లు కదలకపోతే…

కీళ్ల నొప్పులు, కదిలించినప్పుడు టకటకమని విరిగినట్లు శబ్దం రావడం లేదా కిర్రుమని ఒకదానికొకటి రాసుకుంటున్నట్లు శబ్దం రావడం, ఎముకలో వాపు, కీళ్ల దగ్గర నీరు చేరడం, కీళ్ల కదలికలు కష్టంగా అనిపించడం, కీళ్ల...

ఉమెన్‌… నీ హెల్త్ ఎలా ఉంది?

ఉద‌య‌మే లేచి ఇంట్లో వాళ్ల‌కు కావ‌ల‌సిన‌వ‌న్నీ అమ‌ర్చి, పిల్ల‌ల‌ను స్కూలుకు పంపించి భ‌ర్త‌ను ఉద్యోగం, వ్యాపారాల రీత్యా బ‌య‌ట‌కు పంపించే స‌రికి ఎక్క‌డ‌లేని నీర‌సం వ‌చ్చేస్తుంది. త‌న కోసం ఏదో తినాల‌న్న ధ్యాస...

మెదడుకు చైతన్యం

మ్యాగ్నటిక్ బ్రెయిన్ థెరపీ విధానంలో మరో కొత్త ఆవిష్కరణ ట్రాన్స్‌క్రేనియల్ మాగ్నటిక్ స్టిములేషన్. ఈ విధానంలో మైగ్రేన్, డిప్రెషన్, పక్షవాతం వంటి సమస్యలకు చికిత్స చేయవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. మెదడును చైతన్యవంతం చేయడం...

నీ రీప్లేస్‌మెంట్ స‌ర్జ‌రీతో…. కొత్త న‌డ‌క‌

మ‌న‌వ‌రాలిని మురిపెంగా చూస్తోంది రాజేశ్వ‌రి. ఏడాది పూర్త‌యింది. పాపాయి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది. ఆధారం కోసం ప‌క్క‌నే ఉన్న ఫైబ‌ర్ కుర్చీని ప‌ట్టుకుంది పాపాయి. అది నిల‌వ‌లేదు. క‌దిలింది. పాపాయి ఉలిక్కిప‌డింది. మ‌నుమ‌రాలు...

‘డి’ లోపిస్తే టెన్షనే!

దేహంలో ఒక్కో విటమిన్ ఒక్కో రకమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే విటమిన్ ‘డి’ లోపిస్తే ఎదురయ్యే సమస్యల్లో పిల్లల్లో ఆస్త్మా, గుండెసమస్యలు, రికెట్స్ వంటి ఎముకల సమస్య, మధుమేహంతోపాటు హైబీపీ కూడా ఒకటి....

కిడ్నీట్రాన్స్‌ ప్లాంటేష‌న్‌…. జీవితానికి కొత్త పాదు

రాజేశ్‌కి నిండా పాతికేళ్లు పూర్తికాలేదు. కానీ ఏ ఎన‌భైల‌లో వ‌చ్చే వ్యాధి వ‌చ్చేసింది. రెండు కిడ్నీలూ పాడ‌య్యాయి. అత‌డి ముందున్న ప్ర‌త్యామ్నాయం కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ ఒక్క‌టే. కిడ్నీ మార్చాలంటే ఎవ‌రిదైనా కిడ్నీ కావాలి....

ఏంటి విన‌బ‌ళ్లా… మ‌ళ్లీ చెప్పు!

ఇదే మాట త‌ర‌చూ అనాల్సి వ‌స్తోందా? ఎదుటి వాళ్లు ఏదైనా చెబితే అర్థం అయ్యీ కాన‌ట్లు ఉంటోందా? ముఖం చిట్లించి చెవులు రిక్కించి వినాల్సి వ‌స్తోందా? చెవుల కంటే ముందు క‌ళ్ల‌ను అప్ప‌గించి లిప్‌మూవ్‌మెంట్‌ను గ‌మ‌నించాల్సి...

కళ్లను నిమిషానికి ఎన్నిసార్లు ఆర్పుతాం ?

ఫలానా నర్తకి నాట్యం చేస్తున్నంత సేపూ కన్నార్పడం మర్చిపోయారు... వంటి అతిశయోక్తులు వింటూ ఉంటా. కానీ మనుషులు నిమిషానికి ఎన్నిసార్లు కన్నార్పుతారో తెలుసా... పన్నెండుసార్లు. అవును ప్రతి ఐదు సెకన్లకోసారి కనురెప్పలు వాటంతట...

గుజ‌రాత్ ఎందులో టాప్‌? ఆరోగ్యంలోనా…. అనారోగ్యంలోనా?

గుజ‌రాత్ టాప్స్ ఇన్ ద లిస్ట్‌... ఈ వాక్యం ఈ రోజు ఒక జాతీయ దిన‌ప‌త్రిక‌లో ఒక వార్త‌లో భాగంగా వ‌చ్చింది. దీని అర్థం గుజ‌రాత్ అభివృద్ధిలో తొలిస్థానంలో ఉంద‌ని కాదు. ఆరోగ్య‌రంగాన్ని...

పెరుగుతో రొమ్ము క్యాన్స‌ర్‌కి చెక్!

ప్ర‌తి రోజూ పెరుగుని ఆహారంలో తీసుకునేవారిలో రొమ్ముక్యాన్స‌ర్ వ‌చ్చే ప్ర‌మాదం త‌గ్గుతుంద‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. పెరుగులో మంచి బ్యాక్టీరియాని పెంచే ల‌క్ష‌ణాలు ఉన్నాయి. మంచి బ్యాక్టీరియా పెర‌గ‌టం వ‌ల‌న బ్రెస్ట్ క్యాన్స‌ర్ వ‌చ్చే...

వ్యాయామానికి వయసుతో పనిలేదు

వ్యాయామం యౌవనంలో ఉన్నప్పుడే మొదలు పెట్టాలి. ఇరవైలు, ముప్ఫైలలో సాధ్యం కాకపోతే కనీసం నలభైలలో అయినా వ్యాయామం చేయవచ్చు. కానీ 50 ఏళ్లు దాటిన తర్వాత వ్యాయామం చేయడం మంచిది కాదు. యుక్త...

కీరదోస ఉపయోగాలు

కీరదోసలో 96 శాతం నీరు ఉంటుంది. ఈ నీరు దేహాన్ని డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది. దేహంలోని విషతుల్యమైన వ్యర్థాలను బయటకు పంపేస్తుంది. - ఇందులో పొటాషియం, మెగ్నీషియం, సోడియం ఉంటాయి. ఇవి రక్తపోటును...

ఇండియానే టాప్‌…. పొల్యూష‌న్ మ‌ర‌ణాల‌లో!

విన‌డానికే క‌ష్టంగా ఉన్నా ఇది నిజం. ప్ర‌పంచం మొత్తం మీద 2015లో 90 ల‌క్ష‌ల పొల్యూష‌న్ మ‌ర‌ణాలు సంభ‌వించాయి. అందులో ఇండియా వాటా పాతిక ల‌క్ష‌లు. చైనా చావులు ప‌ద్దెనిమిది ల‌క్ష‌లు. ఇండియా,...

పోయిన కిరీటం మ‌ళ్లీ వ‌స్తుంది!

జుట్టు ఒత్తుగా ఉంటే త‌ల మీద కిరీటం ఉన్న‌ట్లుగానే... భావిస్తారు మ‌గ‌వాళ్లు. అమ్మాయి క‌నిపిస్తే క్రాఫ్ స‌ర్దుకోవ‌డం కూడా ఈ ఫీలింగ్ లో నుంచి వ‌చ్చిన మ్యాన‌రిజ‌మే కావ‌చ్చు. అంద‌చందాల‌లో జుట్టుకు అంత‌టి ప్రాధాన్యం ఉండ‌బ‌ట్టేనేమో...

క్యాన్సర్‌ రాబోతుందని తెలియజెప్పే రక్త పరీక్ష

క్యాన్సర్‌ ప్రాణాంతక వ్యాధి. ప్రారంభ దశలో గుర్తిస్తే చాలావరకు నయమవుతుంది. ముదిరిపోయాక తెలుసుకున్నా బ్రతుకుతామన్న ఆశ ఉండదు. ఇప్పటివరకు మనకున్న వైద్య పరిజ్ఞానంతో ప్రారంభదశలో క్యాన్సర్‌ను గుర్తించగలగుతున్నాం. ఇటీవల స్వాన్సీలో జరిగిన బ్రిటీష్‌ సైన్స్‌...

ఇక గుండెపోటుని నిముషంలో…నిర్దారించ‌వ‌చ్చు!

గుండెకి సంబంధించిన వ్యాధుల‌ను అత్యంత త‌క్కువస‌మయంలో అత్యంత స‌మ‌ర్ధ‌వంతంగా క‌నిపెట్టేవిధానాలు, ప‌రిక‌రాలు ఇప్పుడు మ‌న‌కు చాలాఅవ‌సరం. అందుకే ద‌క్షిణ కొరియాలోని ఉల్సాన్నేషన‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీకిచెందిన శాస్త్ర‌వేత్త‌లు ఈ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేసివిజ‌యం సాధించారు. ఈ శాస్త్ర‌వేత్త‌ల్లో మ‌న భార‌తసంత‌తి శాస్త్ర‌వేత్త అభిన‌వ్ కూడా ఉండ‌టం విశేషం. వీరు ఒక ఎల‌క్ట్రిక‌ల్ ఇమ్యునోసెన్సార్ ప‌రిక‌రాన్నిక‌నుగొన్నారు. దీని ద్వారా గుండెకు సంబంధించినవ్యాధుల‌ను, హార్ట్ ఎటాక్స్‌ని ఒక్క నిముషంలో క‌నుగొనినిర్దారించ‌వ‌చ్చు. ఇందుకోసం వీరు కార్డియాక్ ట్రొపోనిన్ఐ… అనే ప్రొటీన్… ర‌క్తంలో ఎంత ప‌రిమాణంలో ఉందోచూస్తారు. గుండె పోటు వ‌చ్చిన‌పుడు…ర‌క్తం గ‌డ్డ‌క‌ట్టి….స్ర‌వించే సీరంలో ఈ ప్రొటీన్..ఉంటుంది. ఇలాంట‌పుడు ఒక్క ర‌క్త‌పుబొట్టుని ఇమ్యునోసెన్సార్ ప‌రిక‌రం ద్వారా ప‌రీక్షించి కార్డియాక్ ట్రొపోనిన్ ఐ ప‌రిమాణం ఎంత ఉందో తెలుసుకుంటే , త‌ద్వారా ప‌రిస్థితి తీవ్ర‌తని అంచ‌నావేసే  వీలుంది. అంటే ఎల‌క్ట్రిక‌ల్ ఇమ్యునోసెన్సార్ ప‌రిక‌రం  హార్ట్ ఎటాక్‌లో… ర‌క్తం గ‌డ్డ క‌ట్టిన‌పుడు స్ర‌వించే సీరంలో ఉండే  ప్రొటీన్‌ని…ర‌క్తంనుండి క్ష‌ణాల్లో విడ‌గొట్టి దాని ప‌రిమాణాన్ని చూపుతుంది. ఇమ్యునోసెన్సార్ విధానం ద్వారా…ప‌రిశీలించాల్సినప్రొటీన్‌ని… ఎలక్ట్రిక్ ఫోర్స్ ద్వారా త్వ‌ర‌గా బ‌య‌ట‌కు తెచ్చే వీలు ఉంది. దీనివ‌ల‌న…అర‌వై నిముషాలు వేచి ఉండాల్సినఈ ప‌రీక్ష ఒక్క నిముషంలో పూర్త‌య్యే వీలు క‌లుగుతుంది. ఒక్క ర‌క్త‌పు చుక్క‌లోని సీరం నుండి కార్డియాక్ ట్రొపోనిన్ ఐప‌రిమాణం ఎంత ఉంది అనే విష‌యాన్ని తెలుసుకోవ‌టం…అనేది మ‌రీ గొప్ప విష‌యంగాచెప్ప‌లేక‌పోయినా….గుండెవ్యాధి నిర్దార‌ణ‌కు అవ‌స‌ర‌మైన ప్రొటీన్‌ని… ఎల‌క్ట్రిక‌ల్ శ‌క్తి ద్వారా వేగంగా బ‌య‌ట‌కు తేవ‌టంలోవిజ‌యం సాధించామ‌ని శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు. దీనిద్వారా ప్రొటీన్‌ని గుర్తించ‌గ‌ల స‌మ‌యం, కాల వ్య‌వ‌ధివిష‌యంలో ముంద‌డుగు వేసిన‌ట్టేన‌ని వారు చెబుతున్నారు.

Recent Posts