Friday, January 24, 2020

మున్నార్ నుంచి ఓ క‌ర‌దీపిక‌

చిన్న‌ప్పుడు పిల్ల‌ల‌కు అమ్మ‌మ్మ‌, నాన‌మ్మ‌, తాత‌య్య‌లు క‌థ‌లు చెప్తారు. ఆ క‌థ‌లు వాళ్లు పెద్ద‌య్యాక జీవితానికి బాట‌లు వేస్తే... ఎంత బావుంటుందో క‌దా! ఆ క‌థ‌లు వేసిన బాట‌లు ఎప్ప‌టికీ మ‌ది నుంచి...

క‌ష్టాల మెట్లు

క‌ల్ప‌నా స‌రోజ్‌... రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా ప‌ద్మ‌శ్రీ అవార్డు (2013) అందుకున్న మ‌హిళ‌.  పారిశ్రామిక సామ్రాజ్యంలో నిల‌దొక్కుకుని వంద‌ల కోట్ల ట‌ర్నోవ‌ర్‌తో వ్యాపారం చేస్తున్న మ‌హిళ‌. వ్యాపారాన్ని విదేశాల‌కు విస్త‌రించి ప్ర‌పంచం ద్రుష్టిలో విజేత‌గా నిలిచిన...

క్రీడారంగంలో భారత నవయువతారలు ….

అరుదైన క్రీడల్లో అసాధారణ పతకాలు స్కీయింగ్, జిమ్నాస్టిక్స్ లోనూ రాణిస్తున్న భారత మహిళలు భారత క్రీడారంగంలో మహిళల జోరు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. క్రికెట్, హాకీ, చెస్, బ్యాడ్మింటన్ లాంటి సాంప్రదాయ...

క‌త్రినా… బ‌డికి పొమ్మంటోంది

క‌త్రినా కైఫ్ సినిమా చూడ‌డానికి వెళ్ల‌మ‌నాలి కానీ బ‌డికి పొమ్మ‌న‌డ‌మేంటి? నిజ‌మే... కానీ క‌త్రినా కైఫ్ మాత్రం అమ్మాయిల‌ను బ‌డికి వెళ్ల‌మ‌ని పొట్టిగౌను వేసుకుని మ‌రీ పోరు పెడుతోంది. మీ అమ్మాయిల‌ను బ‌డికి...

వీధి నాట‌కాల ద్వారా రేప్ లకు వ్యతిరేకంగా ప్రచారం

దేశ రాజ‌ధానిలో అత్యాచారాల ప‌ర్వం కొన‌సాగుతూనే ఉంది. ఇటీవ‌లే ఢిల్లీ యూనివ‌ర్సిటీకి చెందిన ఓ యువ‌తిపై లైంగిక వేధింపులు జ‌ర‌గ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. క‌దులుతున్న బ‌స్సులో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌ను ప‌లువురు...

ఈ ప్ర‌శ్న‌లు ఆడ‌వారినే ఎందుకు అడుగుతారు?

మ‌రో మ‌హిళా దినోత్స‌వం వ‌చ్చేసింది. ప్ర‌తిఏటా స్కేలు పెట్టి కొలిచిన‌ట్టుగా మ‌హిళ‌ల జీవితాల్లో ఏమ‌న్నా మార్పు వ‌చ్చిందా...అనే ప్ర‌శ్న‌ వేసుకోవ‌డం, ఆ దిశ‌గా మీడియాలో వార్త‌లు క‌థ‌నాలు రాసుకోవ‌డం, కార్య‌క్ర‌మాలు  ప్ర‌సారం చేసుకోవ‌డం,...

ప్ర‌పంచ వ్యాప్తంగా త‌గ్గుతున్న బాల్య‌వివాహాలు

ప్ర‌పంచ వ్యాప్తంగా బాల్య వివాహాలు త‌గ్గుతున్న‌ట్లు యూనిసెఫ్ ప్ర‌క‌టించింది. ముఖ్యంగా ఆసియా దేశాల్లో బాల్య‌వివాహాలు గ‌ణ‌నీయంగా త‌గ్గిన‌ట్లు యూనిసెఫ్ నివేదిక వెల్ల‌డించింది. ఆఫ్రికాలో మాత్రం బాల్య‌వివాహాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్న‌ట్లు యూనిసెఫ్ గుర్తించింది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ...

మంచి ప్రారంభం!

అక్ష‌య్‌కుమార్ ఓ సంచల‌నానికి కార‌ణ‌మ‌య్యాడు. త‌మిళ‌నాడులో అరుణాచ‌లం త‌ల‌కెత్తుకున్న ఓ సామాజిక చైత‌న్యానికి వెండితెర‌తో కుగ్రామాల‌కు బాట వేశాడు అక్ష‌య్‌కుమార్. ప్యాడ్‌మాన్ సినిమా స్ఫూర్తిని దేశ‌మంతా స్వాగ‌తించింది. మొన్న బెంగాల్ ప్ర‌భుత్వం ఓ...

38 ఏళ్ళ తరువాత సౌదీలో సినిమా ప్రదర్శనలు

సినిమాలు చూడడం ఇస్లాం మతానికి, సంస్కృతికి విరుద్దమని సౌదీ అరేబియాలో 1980 నుంచి సినిమా థియేటర్లలో ప్రదర్శనలను నిలిపివేశారు.   యువరాజు మ‌హ‌మ్మ‌ద్ బిన్ స‌ల్మాన్ అధికారం చేపట్టాక అనేక అభ్యుదయ కార్యాక్రమాలను చేపట్టినట్టే ప్రజలకు...

ద‌ట్ లాంగ్ సైలెన్స్‌… మ‌ధ్య త‌ర‌గ‌తి మ‌హిళ మ‌నోగ‌తం

రెండు ద‌శాబ్దాల‌కు ముందు వ‌చ్చిన ఈ ర‌చ‌న విద్యావంతురాలైన ప్ర‌తి మ‌హిళ‌నూ పున‌రాలోచ‌న‌లో ప‌డేసింది. అప్ప‌ట్లో మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబంలో మ‌హిళ ఒక అనామిక‌. త‌న‌కంటూ ఒక గుర్తింపు ఏదీ ఉండేది కాదు....

నాన్నకు ప్రేమతో ఓ కాంస్య పతకం….

మెల్బోర్న్ లో ముగిసిన ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్ లో తెలుగమ్మాయి అరుణా రెడ్డి... కాంస్య పతకం నెగ్గి చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా జిమ్నాస్ట్ గా రికార్డుల్లో చోటు...

ఆమె క‌ల‌ల‌కు రెక్క‌లొచ్చాయి!

స‌య్య‌ద్ స‌ల్వా ఫాతిమా... హైద‌రాబాద్ పాత‌బ‌స్తీకి చెందిన యువ‌తి. ఆమె తండ్రి బేక‌రీలో ఉద్యోగి. ఆమె క‌ల పైల‌ట్ కావాల‌ని. ప‌దేళ్ల కింద‌ట ఓ సారి ఓ సంద‌ర్భంలో ఆమె నోటి వెంట...

ఇరాన్ యువతుల మహా సాహసం

గడ్డాలు, మీసాలు ధరించి సాకర్ స్టేడియంలో ప్రవేశించిన ఇరానీ మహిళలు మారువేషాలలో పురుషుల ఫుట్ బాల్ మ్యాచ్ కు హాజరైన యువతులు పురుషుల మ్యాచ్ లకు మహిళలు హాజరుకావడం ఇరాన్ లో...

హైద‌రాబాద్ అమ్మాయి…. ఐశ్వ‌ర్యారాయ్ డ్ర‌స్‌

హాసినీ బోయిన్‌ప‌ల్లి తాజాగా బాలీవుడ్ దృష్టిని క‌ట్టిప‌డేసిన అమ్మాయి. చ‌క్క‌టి పెళ్లి కూతురు. ఐశ్వ‌ర్యారాయ్‌కి చెల్లెలా అనిపించింది కొద్దిసేపు. ఓవ‌రాల్ అప్పియ‌రెన్స్ అలా ఉంది కానీ పోలిక‌లు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఇంత‌కీ...

ది ఇండియ‌న్ ఉమ‌న్‌…. డ‌బ్ల్యు డ‌బ్ల్యు ఈ లో తొలి భార‌తీయ మ‌హిళ‌

క‌వితాదేవి... భార‌తీయ మ‌హిళ‌ల‌కు చైత‌న్య‌దీపిక‌. యువ‌తుల‌కు మార్గ‌ద‌ర్శి. ఆమె చొర‌వ రాబోయే త‌రానికి ఒక భ‌రోసా. ఇంత పెద్ద మాట‌ల‌తో క‌వితాదేవిని ప్ర‌శంసించ‌డానికి వెనుక బ‌ల‌మైన కార‌ణ‌మే ఉంది. మ‌హిళ‌లు క్రీడారంగంలోకి రావ‌డానికే...

వన్డే క్రికెట్లో పురుషులను మించిన మహిళలు

మహిళా వన్డేల్లో న్యూజిలాండ్ సరికొత్త ప్రపంచ రికార్డు ఐర్లాండ్ పై న్యూజిలాండ్ 4 వికెట్లకు 490 పరుగులు సుజీ బేట్స్ 151, మాడీ గ్రీన్ 121 పరుగులు 64 బౌండ్రీలు, 7...

పెరుగుతో రొమ్ము క్యాన్స‌ర్‌కి చెక్!

ప్ర‌తి రోజూ పెరుగుని ఆహారంలో తీసుకునేవారిలో రొమ్ముక్యాన్స‌ర్ వ‌చ్చే ప్ర‌మాదం త‌గ్గుతుంద‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. పెరుగులో మంచి బ్యాక్టీరియాని పెంచే ల‌క్ష‌ణాలు ఉన్నాయి. మంచి బ్యాక్టీరియా పెర‌గ‌టం వ‌ల‌న బ్రెస్ట్ క్యాన్స‌ర్ వ‌చ్చే...

ప్రపంచ షూటింగ్ కు కాంట్రాక్టు కార్మికుని కుమార్తె

అరువు తుపాకితో ప్రియాసింగ్ అష్టకష్టాలు ప్రపంచ జూనియర్ షూటింగ్ కు ఎంపికైన ప్రియాసింగ్ ప్రియాసింగ్ గోడు వినని ప్రధాని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రపంచ స్థాయిలో భారత్ కు అత్యధికంగా పతకాలు అందించే క్రీడ...

వ‌ర‌ల్డ్ ఫిట్‌నెస్‌…. మానుషి ఏం తింటుంది?…. ఏం చేస్తుంది?

ఇప్పుడు మిస్ వ‌ర‌ల్డ్ మానుషి చిల్ల‌ర్ చుట్టూ తిరుగుతోంది ఇండియా. ముఖ్యంగా యువ‌త‌. ఆమె ఏమి తింటోంది? ఏయే ఎక్స‌ర్‌సైజ్‌లు చేస్తోంది. ఫిట్‌నెస్ మెయింటెనెన్స్ సీక్రెట్ ఏంటి? అని ఆరాలు మొద‌లయ్యాయి. వీట‌న్నింటికీ స‌మాధానంగా...

క్రీడారంగంలో చాంపియన్ తల్లులు

క్రీడలకు మాతృత్వం అడ్డుకాదంటున్న స్టార్లు ఒలింపిక్స్ నుంచి టెన్నిస్ వరకూ విజేత తల్లులు తల్లి హోదాలో వింబుల్డన్ లో సెరెనా జోరు కవలల తల్లిగా ప్రపంచ విజేత మేరీ కోమ్ క్రీడలకు మాతృత్వం,...

మ‌గ‌వాళ్ల‌ను త‌ప్పించ‌డానికి…. ఆడ‌వాళ్ల‌ను శిక్షించ‌కండి

సెక్స్‌కు స‌రైన ఏజ్ ఎంత‌? అని త‌ల‌లు బ‌ద్ద‌లు కొట్టుకుంటోంది ఫ్రాన్స్ ప్ర‌భుత్వం. ప‌ద‌మూడేళ్లు చాలు ఆ దేశ న్యాయ‌శాఖ మంత్రి నికోల్ బెల్లూబెట్ అంటున్నారు. యాక్టివిస్టులు 'థూ' అని ముఖాన ఉమ్మేయ‌డం...

రికార్డు సృష్టించిన పూణే మ‌హిళ …చీర‌తో స్కై డైవింగ్‌

పూణెకు చెందిన షీత‌ల్ రాణే ఒక రిస్కీ ఫీట్ చేసి రికార్డు సృష్టించింది. చీర ధ‌రించి ఆమె స్కై డైవింగ్ చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రిచింది. స్కైడైవింగ్ చేయ‌డానికి ప్ర‌త్యేక దుస్తులు ధ‌రించాల్సి...

సౌదీ మ‌హిళ‌ల‌కు ఫుట్‌బాల్ మ్యాచ్ చూసే అవ‌కాశం

సౌదీ అరేబియాలో మ‌హిళ‌ల పట్ల ఉన్న ఆంక్ష‌లు ఒక్కొక్క‌టిగా తొల‌గుతున్నాయి. టాక్సీ డ్రైవ‌ర్లుగా మ‌హిళల‌కు అవ‌కాశం క‌ల్పించ‌డం వంటి నిర్ణ‌యాలు తీసుకున్న సౌదీ ప్ర‌భుత్వం తాజాగా మ‌హిళ‌లు ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూసేందుకు అడ్డును...

గ‌న్ను ప‌ట్టి గ‌స్తీ కాయ‌డానికి రెడీ

అమ్మాయిలు అన్ని రంగాల్లో దూసుకెళ్లాలి... ప్ర‌తి మ‌హిళా దినోత్స‌వం రోజునా ప్ర‌తి స‌భ‌లో ప్ర‌తి వ‌క్త ప‌లికే ఆణిముత్యాల్లాంటి ప‌లుకులివి. ప‌లుకుల‌కు ప‌రిమితం కాకుండా మ‌హిళ‌లు ఒక్కో రోజు ఒక్కో రికార్డు సాధిస్తూ...

వంద పెళ్లిళ్లు షూట్ చేసింది!

జిమ్ కార్బెట్ నుంచి శ్రీ‌లంక వ‌ర‌కు కొన‌సాగింది ఆమె ప్ర‌యాణం. నాగ‌పూర్‌ ఎన్ ఐ టి లో ఎల‌క్ట్రిక‌ల్ ఇంజ‌నీరింగ్ చ‌దివింది. మార్కెట్‌లో నిల‌దొక్కుకోలేని, నెల‌కు జీతం క‌రెక్ట్ ఇవ్వ‌లేని రెండు కంపెనీల‌లో...

మ‌హారాష్ట్ర‌ మెట‌ర్నిటీ లీవ్ తొమ్మిది నెల‌లు

మ‌హిళల కోసం మ‌హారాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖ ఓ కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకుంది. గ‌ర్భిణుల‌కు మ‌రో మూడు నెల‌ల పెయిడ్ హాలిడే ఇవ్వ‌డానికి సిద్ధ‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు 2010లో ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చిన‌ కేంద్ర...

భారత మహిళా నావికుల సాహసం

ఆరుగురు సభ్యుల సాగరయానం మరబోటులో ప్రపంచాన్ని చుట్టివచ్చిన యువతుల బృందం ఐదు దేశాలు, నాలుగు ఖండాలు మూడు సముద్రాలు, మూడు అఖాతాలు రంగం ఏదైనా ...భారత మహిళలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నారు. తగిన...

మెనోపాజ్ ద‌శ‌కు ముందు కూడా….. మ‌హిళల్లో గుండెజ‌బ్బులు..

మ‌హిళ‌ల్లో గుండెవ్యాధులు 10శాతం పెరిగాయ‌ని న్యూఢిల్లీలోని నేష‌న‌ల్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది. 2012-16 మ‌ధ్య‌కాలంలో ఆసుప‌త్రిలో చేరిన 1,20,444మంది పేషంట్ల‌పై అధ్య‌య‌నాన్ని నిర్వ‌హించి ఈ విష‌యం క‌నుగొన్న‌ట్టుగా అధ్య‌య‌న నిర్వాహ‌కులు తెలిపారు. మ‌హిళ‌లు యువ‌తీయువ‌కులు సైతం గుండె అనారోగ్యాల‌కు గుర‌వ‌టం పెరుగుతున్న‌ద‌ని అనారోగ్య‌క‌ర‌మైన ఆహారం, పొకాగు ఉత్ప‌త్తుల వినియోగం పెర‌గ‌టం,  వ్యాయామం లేని జీవ‌న శైలి, ఒత్తిడి ఇందుకు కార‌ణ‌మ‌ని అధ్య‌య‌న ఫ‌లితాలు చెబుతున్నాయి. మెనోపాజ్ ద‌శ వ‌ర‌కు మ‌హిళ‌ల‌కు గుండెవ్యాధులు రాకుండా ఈస్ట్రోజ‌న్ హార్మోను ర‌క్షిస్తుంద‌ని,  ఆ ద‌శ‌కు చేరుకోగానే 50-55 ఏళ్ల  వ‌య‌సులో ఈస్ట్రోజ‌న్ హార్మోన్ ఉత్ప‌త్తి త‌గ్గిపోతుంద‌ని... ఆపై మ‌హిళ‌ల్లో కూడా మ‌గ‌వారిలో లాగే  గుండెవ్యాధులు రావ‌టం  జ‌రుగుతుంద‌ని...కానీ ఈ ప‌రిస్థితి మారిపోయి మెనోపాజ్ ద‌శకు ముందు కూడా  గుండె జ‌బ్బుల‌కు గుర‌వుతున్న మ‌హిళ‌ల సంఖ్య గ‌ణ‌నీయంగా  పెరుగుతున్న‌ద‌ని అధ్య‌య‌నంలో తేలింది. పొగ‌తాగ‌టం, బ‌రువు త‌గ్గేందుకు అనుస‌రిస్తున్న ప్ర‌మాద‌క‌ర‌మైన విధానాలు, అనారోగ్య‌క‌ర‌మైన ఆహారం, అధిక ఒత్తిడి, ప‌రీక్ష‌లు చేయించుకోక‌పోవ‌టం...ఇవ‌న్నీ మ‌హిళ‌ల్లో మెనోపాజ్‌కు ముందే గుండె వ్యాధుల‌ను పెంచుతున్నాయ‌ని వైద్యులు చెబుతున్నారు. మ‌హిళ‌ల‌కు గుండెవ్యాధులు త‌క్కువ‌గా వ‌స్తాయ‌ని అనుకోలేమ‌ని, అవ‌గాహ‌నా లోపం, ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు లేక‌పోవ‌టం వ‌ల‌న వారు కూడా ఈ ప్ర‌మాదం బారిన ప‌డుతున్నార‌ని నేష‌న‌ల్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ కార్డియాల‌జీ స‌ర్వీసెస్ హెడ్‌, వైస్‌-చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ వినోద్ శ‌ర్మ తెలిపారు. ఇత‌ర‌దేశాల‌తో పోలిస్తే గుండెపోటుకి గుర‌యిన‌వారు మ‌ర‌ణించే ప్ర‌మాదం మ‌న‌దేశంలో నాలుగురెట్లు ఎక్కువ‌గా ఉంద‌ని నేష‌న‌ల్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ సిఇఓ ఓపి యాద‌వ్ అన్నారు. ప‌శ్చిమ‌దేశాల్లో జీవ‌న‌శైలి మార్పుల‌తో ప్ర‌మాదాన్ని నివారించుకుంటార‌ని, అభివృద్ది చెందుతున్న దేశాల్లో ఇది సాధ్యం కాద‌ని ఆయ‌న అన్నారు. ప‌ళ్లు కూర‌గాయ‌లు ఎక్కువ‌గా తీసుకోవ‌టం, 20-30 నిముషాల వ్యాయామాన్ని క‌నీసం వారానికి మూడురోజులు చేయ‌టం గుండె ఆరోగ్యానికి అత్య‌వ‌స‌ర‌మ‌ని వైద్యులు చెబుతున్నారు. 35ఏళ్లు దాటాక క్ర‌మం త‌ప్ప‌కుండా ఆరోగ్య‌ప‌రీక్ష‌లు కూడా అవ‌స‌ర‌మ‌ని వారు స‌ల‌హా ఇస్తున్నారు.

20 కోట్ల మహిళ‌ల‌ వేద‌న ఇది

ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌హిళ‌ల ఆవేద‌న ఇది. ఐక్య రాజ్య‌స‌మితిలో స‌భ్య‌త్వం ఉన్న‌ 193 దేశాలలోని ఉద్యోగినుల ప‌రిస్థితి. ప‌రిస్థితి అన‌డం కంటే దుస్థితి అన‌డ‌మే క‌రెక్ట్‌. హెరాస్‌మెంట్ య‌ట్ వ‌ర్క్‌ప్లేస్‌... 20 కోట్ల మంది ...

Recent Posts