Friday, February 28, 2020

మెరుపు తీగ‌కు…. బంగారు తీగ‌ల గౌన్‌

ఇవాంక అమెరికాకు వెళ్లిపోయింది. మెరుపులా వ‌చ్చి రెండు రోజుల్లో  సుడిగాలిలాగ న‌గ‌రాన్ని చుట్టేసి  వెళ్లిపోయింది.  మెరుపులా వ‌చ్చి వెళ్లిన మెరుపుతీగ ధ‌రించిన డ్రెస్‌లు గుర్తున్నాయా?  మోడ‌ర‌న్ లుక్‌లో ఎక్క‌డో భార‌తీయ‌త క‌నిపించింది క‌దూ!...

అనుబంధం… ఇది అక్కాచెల్లెళ్ల అనుబంధం

అది 1975. ఫొటోగ్ర‌ఫీ ప్రొఫెస‌ర్ నిక్ నిక్స‌న్‌కి ఓ ఆలోచ‌న వ‌చ్చింది. త‌న భార్య బెబెకు ఒక గొప్ప బ‌హుమ‌తిని ఇవ్వాల‌నుకున్నాడు. అదే సంగ‌తి ఆమె అక్క‌చెల్లెళ్ల‌కు చెప్పాడు. వాళ్లు కూడా ఆనందంగా...

హ‌ర్యానా ప‌రువు కాపాడుతున్న మ‌హిళ‌లు

ఆడ‌బిడ్డ‌ల‌ను పురిటిలోనే చంపేసే దురాచారం హ‌ర్యానా రాష్ట్రంలో చాలా ఏళ్ల నుంచి ఉంది. పుట్టిన త‌ర్వాత కూడా ఆడ‌బిడ్డ‌ల నోటిలో వ‌డ్ల‌గింజ‌ల‌ను వేసి ఊపిరి ఆడ‌కుండా చేస్తారు. వారికి జీవించే అవ‌కాశాం లేకుండా...

వ‌ర‌ల్డ్ ఫిట్‌నెస్‌…. మానుషి ఏం తింటుంది?…. ఏం చేస్తుంది?

ఇప్పుడు మిస్ వ‌ర‌ల్డ్ మానుషి చిల్ల‌ర్ చుట్టూ తిరుగుతోంది ఇండియా. ముఖ్యంగా యువ‌త‌. ఆమె ఏమి తింటోంది? ఏయే ఎక్స‌ర్‌సైజ్‌లు చేస్తోంది. ఫిట్‌నెస్ మెయింటెనెన్స్ సీక్రెట్ ఏంటి? అని ఆరాలు మొద‌లయ్యాయి. వీట‌న్నింటికీ స‌మాధానంగా...

ఆమె క‌ల‌ల‌కు రెక్క‌లొచ్చాయి!

స‌య్య‌ద్ స‌ల్వా ఫాతిమా... హైద‌రాబాద్ పాత‌బ‌స్తీకి చెందిన యువ‌తి. ఆమె తండ్రి బేక‌రీలో ఉద్యోగి. ఆమె క‌ల పైల‌ట్ కావాల‌ని. ప‌దేళ్ల కింద‌ట ఓ సారి ఓ సంద‌ర్భంలో ఆమె నోటి వెంట...

మ‌గ‌వాళ్ల‌ను త‌ప్పించ‌డానికి…. ఆడ‌వాళ్ల‌ను శిక్షించ‌కండి

సెక్స్‌కు స‌రైన ఏజ్ ఎంత‌? అని త‌ల‌లు బ‌ద్ద‌లు కొట్టుకుంటోంది ఫ్రాన్స్ ప్ర‌భుత్వం. ప‌ద‌మూడేళ్లు చాలు ఆ దేశ న్యాయ‌శాఖ మంత్రి నికోల్ బెల్లూబెట్ అంటున్నారు. యాక్టివిస్టులు 'థూ' అని ముఖాన ఉమ్మేయ‌డం...

అనేక భారత రికార్డులు ఈమె సొంతం

ఒక మ‌హిళ త‌న‌ను తాను నిరూపించుకోవాలంటే ఎదురీదాల్సిందే ఇప్ప‌టికీ. ఆధునిక స‌మాజంలోనూ ఎదురీత త‌ప్ప‌డం లేదు. అలాంటిది... పూర్తి సంప్ర‌దాయ‌బ‌ద్ధ‌మైన నేప‌థ్యంలో మ‌హిళ ఇల్లు దాటి త‌ల బ‌య‌ట పెట్ట‌డానికి అనుమ‌తించ‌ని రోజుల్లో...

ఆ యువ‌తి ల‌క్ష్యం మారింది…. ఈ గురి… త‌ప్ప‌దు

ఒక సంఘ‌ట‌న ఒక్కొక్క‌రి మీద ఒక్కొక్క‌ర‌క‌మైన ప్ర‌భావాన్ని చూపిస్తుంది. మ‌హిళ‌ల విష‌యంలో అది మ‌రీ ముఖ్యం. అది కూడా లైంగిక దాడికి గుర‌యిన‌ అమ్మాయిల విష‌యంలో కండిష‌న్‌ మ‌రింత సున్నితం. బ‌ల‌హీన మైన...

మ‌హిళ‌ల ఫుట్ బాల్ టోర్న‌మెంట్‌…. తెలుగ‌మ్మాయి రికార్డు

గుగులత్ సౌమ్య నిజామాబాద్ అమ్మాయి. నిజామాబాద్ జిల్లాలో కిష‌న్ తండాలో పుట్టింది. ప‌ద‌హారేళ్ల‌మ్మాయి. ఇంట‌ర్ మీడియ‌ట్ చ‌దువుతోంది. ఈ నేప‌థ్యం చూస్తే 'ఆడ‌పిల్ల‌వు ఒద్దిక‌గా ఉండ‌క ఆ ఆట‌లేంటి' అనే మంద‌లింపుల మ‌ధ్య...

అమ్మకానికి అమ్మాయిలు

ఇది ఈశాన్య భార‌తం దుస్థితి. అస్సాం టీ తోట‌ల్లో ప‌ని చేయ‌డానికి ప‌నివాళ్లుగా మారిపోతున్నారు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌తోపాటు అస్సాం లోని అనేక గ్రామాల్లో ఇదే ప‌రిస్థితి. క‌ర‌డుక‌ట్టిన పేద‌రిక‌మే ఈ ప‌ని చేయిస్తోంది....

ఈ ఫుడ్‌ని జుట్టుకీ పెట్టొచ్చు!

మ‌నం తినే, తాగే ఆహార ప‌దార్థాల్లోని కొన్నింటిని మ‌న హెయిర్‌కి కూడా పెట్టొచ్చు. అంటే జుట్టుకి అప్ల‌యి చేయ‌వ‌చ్చు. జుట్టు ఆరోగ్యాన్ని పెంచే అలాంటి ఘ‌న, ద్ర‌వ ప‌దార్థాల గురించి- -తాజా కొబ్బ‌రి నీటిని...

20 కోట్ల మహిళ‌ల‌ వేద‌న ఇది

ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌హిళ‌ల ఆవేద‌న ఇది. ఐక్య రాజ్య‌స‌మితిలో స‌భ్య‌త్వం ఉన్న‌ 193 దేశాలలోని ఉద్యోగినుల ప‌రిస్థితి. ప‌రిస్థితి అన‌డం కంటే దుస్థితి అన‌డ‌మే క‌రెక్ట్‌. హెరాస్‌మెంట్ య‌ట్ వ‌ర్క్‌ప్లేస్‌... 20 కోట్ల మంది ...

ఈ ప్ర‌శ్న‌లు ఆడ‌వారినే ఎందుకు అడుగుతారు?

మ‌రో మ‌హిళా దినోత్స‌వం వ‌చ్చేసింది. ప్ర‌తిఏటా స్కేలు పెట్టి కొలిచిన‌ట్టుగా మ‌హిళ‌ల జీవితాల్లో ఏమ‌న్నా మార్పు వ‌చ్చిందా...అనే ప్ర‌శ్న‌ వేసుకోవ‌డం, ఆ దిశ‌గా మీడియాలో వార్త‌లు క‌థ‌నాలు రాసుకోవ‌డం, కార్య‌క్ర‌మాలు  ప్ర‌సారం చేసుకోవ‌డం,...

మీరు బిజీ బిజీనా…ప్రాణానికి ముప్పుంది జాగ్ర‌త్త‌!

చాలామంది ఆడ‌వాళ్లు త‌మ ఆరోగ్యాన్ని ఏమాత్రం ప‌ట్టించుకోకుండా ప‌నిచేస్తుంటారు. ప‌ని అయిపోవ‌డ‌మే ముఖ్యమ‌ని భావిస్తుంటారు. అంతేకాదు, ఎంత ఎక్కువ శారీర‌క శ్ర‌మ చేస్తే అంత గొప్ప… అనే భావ‌న సైతం మ‌హిళ‌ల్లో ఉంటుంది. మ‌న సినిమాలు సాహిత్యం లాంటివి కూడా అలాగే చూపుతుంటాయి. ముగ్గులేస్తే అయిదోత‌న‌మ‌ని, ఇల్లు ఊడిస్తే ఇంటిదీప‌మ‌ని... ఇలా మ‌హిళ‌ల భావోద్వేగాల‌కు చాకిరిని ముడిపెట్టి, మ‌ళ్లీ వాటికి అంద‌మైన సాహిత్యంగా పేరుపెట్టి  స‌మాజంలోకి ఎక్కించారు. కాస్త ప‌ద‌జాలం మారి...అవ‌న్నీ ఇప్పుడు ఆధునిక మ‌హిళ‌ల సామ‌ర్ధ్యాలుగా, మ‌ల్టీ టాస్కింగ్‌గా మ‌న‌ముందుకు వ‌స్తున్నాయి. ఇంటిప‌నిని ప‌నిలాగే చూస్తే సరిపోతుంది. అప్పుడు ఇంట్లో ఉన్న వారంద‌రూ అన్ని ప‌నుల‌ను చేసే అవ‌కాశం ఉంటుంది. అలాకాకుండా ఇంటి చాకిరికి స్త్రీత్వాన్ని జోడించ‌డం, ఉత్త‌మ మ‌హిళ‌ల ల‌క్ష‌ణాలుగా ప‌నుల‌ను పేర్కొన‌టం...ఎంత తెలివిత‌క్కువ వారికైనా అర్థ‌మైపోతుంది...ఇదంతా చాలా చాక‌చ‌క్యంతో చేస్తున్న‌ మోస‌మని. ఆహారం, ప‌ని,  విశ్రాంతి, నిద్ర ఇవి  జీవుల‌న్నింటికీ స‌మాన‌మే. ప‌నిఒత్తిడితో వీటి మ‌ధ్య స‌మ‌న్వ‌యం లోపిస్తే...మ‌హిళ‌ల ప్రాణాలకే ముప్ప‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ఏక‌కాలంలో అనేక ప‌నుల‌ను నిర్వ‌హిస్తూ ఇంటిప‌ని, ఆఫీసులో ఒత్తిళ్ల‌తో త‌ల‌మున‌క‌ల‌య్యే మ‌హిళ‌లకు జీవిత కాలం త‌గ్గిపోతుంద‌ని అమెరికాలోని ఒహాయో స్టేట్ వ‌ర్శిటీ ప‌రిశోధ‌కులు హెచ్చ‌రిస్తున్నారు. వారంలో 40 గంట‌ల‌కు మించి 30 ఏళ్ల‌పాటు నిరంత‌రాయంగా శ్ర‌మించిన మ‌హిళ‌ల‌కు మ‌ధుమేహం, క్యాన్స‌ర్‌, గుండెజ‌బ్బులు త్వ‌ర‌గా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అధ్య‌య‌నాల్లో రుజువైన‌ట్టుగా వారు వెల్ల‌డించారు. అలాగే వారానికి ప‌నిగంట‌లు 60 కంటే ఎక్కువుంటే వారిలో ఈ ముప్పు మూడురెట్లు పెరుగుతుంది. అయితే పురుషులు ఇంత‌గానూ శ్ర‌మించినా వారిలో వ్య‌తిరేక ప్ర‌భావాలు మ‌హిళ‌ల స్థాయిలో క‌నిపించ‌లేద‌ని వారు వెల్ల‌డించారు. అందుకే అంద‌రికీ న్యాయం చేయాల‌ని త‌పించే ముందు మ‌హిళ‌లు, త‌మ‌కు తాము కూడా న్యాయం చేసుకోవాల‌ని ఆలోచించాల్సిందే మ‌రి.

పెరుగుతో రొమ్ము క్యాన్స‌ర్‌కి చెక్!

ప్ర‌తి రోజూ పెరుగుని ఆహారంలో తీసుకునేవారిలో రొమ్ముక్యాన్స‌ర్ వ‌చ్చే ప్ర‌మాదం త‌గ్గుతుంద‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. పెరుగులో మంచి బ్యాక్టీరియాని పెంచే ల‌క్ష‌ణాలు ఉన్నాయి. మంచి బ్యాక్టీరియా పెర‌గ‌టం వ‌ల‌న బ్రెస్ట్ క్యాన్స‌ర్ వ‌చ్చే...

ద‌ట్ లాంగ్ సైలెన్స్‌… మ‌ధ్య త‌ర‌గ‌తి మ‌హిళ మ‌నోగ‌తం

రెండు ద‌శాబ్దాల‌కు ముందు వ‌చ్చిన ఈ ర‌చ‌న విద్యావంతురాలైన ప్ర‌తి మ‌హిళ‌నూ పున‌రాలోచ‌న‌లో ప‌డేసింది. అప్ప‌ట్లో మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబంలో మ‌హిళ ఒక అనామిక‌. త‌న‌కంటూ ఒక గుర్తింపు ఏదీ ఉండేది కాదు....

ది ఇండియ‌న్ ఉమ‌న్‌…. డ‌బ్ల్యు డ‌బ్ల్యు ఈ లో తొలి భార‌తీయ మ‌హిళ‌

క‌వితాదేవి... భార‌తీయ మ‌హిళ‌ల‌కు చైత‌న్య‌దీపిక‌. యువ‌తుల‌కు మార్గ‌ద‌ర్శి. ఆమె చొర‌వ రాబోయే త‌రానికి ఒక భ‌రోసా. ఇంత పెద్ద మాట‌ల‌తో క‌వితాదేవిని ప్ర‌శంసించ‌డానికి వెనుక బ‌ల‌మైన కార‌ణ‌మే ఉంది. మ‌హిళ‌లు క్రీడారంగంలోకి రావ‌డానికే...

మెనోపాజ్ ద‌శ‌కు ముందు కూడా….. మ‌హిళల్లో గుండెజ‌బ్బులు..

మ‌హిళ‌ల్లో గుండెవ్యాధులు 10శాతం పెరిగాయ‌ని న్యూఢిల్లీలోని నేష‌న‌ల్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది. 2012-16 మ‌ధ్య‌కాలంలో ఆసుప‌త్రిలో చేరిన 1,20,444మంది పేషంట్ల‌పై అధ్య‌య‌నాన్ని నిర్వ‌హించి ఈ విష‌యం క‌నుగొన్న‌ట్టుగా అధ్య‌య‌న నిర్వాహ‌కులు తెలిపారు. మ‌హిళ‌లు యువ‌తీయువ‌కులు సైతం గుండె అనారోగ్యాల‌కు గుర‌వ‌టం పెరుగుతున్న‌ద‌ని అనారోగ్య‌క‌ర‌మైన ఆహారం, పొకాగు ఉత్ప‌త్తుల వినియోగం పెర‌గ‌టం,  వ్యాయామం లేని జీవ‌న శైలి, ఒత్తిడి ఇందుకు కార‌ణ‌మ‌ని అధ్య‌య‌న ఫ‌లితాలు చెబుతున్నాయి. మెనోపాజ్ ద‌శ వ‌ర‌కు మ‌హిళ‌ల‌కు గుండెవ్యాధులు రాకుండా ఈస్ట్రోజ‌న్ హార్మోను ర‌క్షిస్తుంద‌ని,  ఆ ద‌శ‌కు చేరుకోగానే 50-55 ఏళ్ల  వ‌య‌సులో ఈస్ట్రోజ‌న్ హార్మోన్ ఉత్ప‌త్తి త‌గ్గిపోతుంద‌ని... ఆపై మ‌హిళ‌ల్లో కూడా మ‌గ‌వారిలో లాగే  గుండెవ్యాధులు రావ‌టం  జ‌రుగుతుంద‌ని...కానీ ఈ ప‌రిస్థితి మారిపోయి మెనోపాజ్ ద‌శకు ముందు కూడా  గుండె జ‌బ్బుల‌కు గుర‌వుతున్న మ‌హిళ‌ల సంఖ్య గ‌ణ‌నీయంగా  పెరుగుతున్న‌ద‌ని అధ్య‌య‌నంలో తేలింది. పొగ‌తాగ‌టం, బ‌రువు త‌గ్గేందుకు అనుస‌రిస్తున్న ప్ర‌మాద‌క‌ర‌మైన విధానాలు, అనారోగ్య‌క‌ర‌మైన ఆహారం, అధిక ఒత్తిడి, ప‌రీక్ష‌లు చేయించుకోక‌పోవ‌టం...ఇవ‌న్నీ మ‌హిళ‌ల్లో మెనోపాజ్‌కు ముందే గుండె వ్యాధుల‌ను పెంచుతున్నాయ‌ని వైద్యులు చెబుతున్నారు. మ‌హిళ‌ల‌కు గుండెవ్యాధులు త‌క్కువ‌గా వ‌స్తాయ‌ని అనుకోలేమ‌ని, అవ‌గాహ‌నా లోపం, ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు లేక‌పోవ‌టం వ‌ల‌న వారు కూడా ఈ ప్ర‌మాదం బారిన ప‌డుతున్నార‌ని నేష‌న‌ల్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ కార్డియాల‌జీ స‌ర్వీసెస్ హెడ్‌, వైస్‌-చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ వినోద్ శ‌ర్మ తెలిపారు. ఇత‌ర‌దేశాల‌తో పోలిస్తే గుండెపోటుకి గుర‌యిన‌వారు మ‌ర‌ణించే ప్ర‌మాదం మ‌న‌దేశంలో నాలుగురెట్లు ఎక్కువ‌గా ఉంద‌ని నేష‌న‌ల్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ సిఇఓ ఓపి యాద‌వ్ అన్నారు. ప‌శ్చిమ‌దేశాల్లో జీవ‌న‌శైలి మార్పుల‌తో ప్ర‌మాదాన్ని నివారించుకుంటార‌ని, అభివృద్ది చెందుతున్న దేశాల్లో ఇది సాధ్యం కాద‌ని ఆయ‌న అన్నారు. ప‌ళ్లు కూర‌గాయ‌లు ఎక్కువ‌గా తీసుకోవ‌టం, 20-30 నిముషాల వ్యాయామాన్ని క‌నీసం వారానికి మూడురోజులు చేయ‌టం గుండె ఆరోగ్యానికి అత్య‌వ‌స‌ర‌మ‌ని వైద్యులు చెబుతున్నారు. 35ఏళ్లు దాటాక క్ర‌మం త‌ప్ప‌కుండా ఆరోగ్య‌ప‌రీక్ష‌లు కూడా అవ‌స‌ర‌మ‌ని వారు స‌ల‌హా ఇస్తున్నారు.

ఇంటర్‌నెట్‌లో ప్రత్యక్షమవుతున్న పడకగదులు

పిచ్చి ముదిరింది, తలకు రోకలి చుట్టమన్నాడట వెనకటికి ఎవడో.... ఇప్పుడు జనాలకు సెల్ఫీల పిచ్చి పరాకాష్టకు చేరింది. సెల్ఫీల మోజులో చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా రెండు రోజుల క్రితం ఈ...

ఓయ్‌! మ‌గాళ్లూ!! న‌న్ను చూడండి!

అది రాజ‌స్థాన్ రాష్ట్రం, ఉద‌య్‌పూర్ న‌గ‌రానికి ఇంచుమించు 40 కిమీల దూరంలో ఓ కుగ్రామం. పేరు ప‌డూనా. ఆరావ‌ళి కొండ‌ల్లో ఉంటుంది. ఏ మాత్రం అభివ్రుద్ధికి నోచుకోని గ్రామం. ఇలాంటి గ్రామాలు మ‌న‌దేశంలో...

Recent Posts