చంద్రుల కుప్పిగంతులకు మోడీ చెక్

1269
chandrababu kcr reservation politics muslim kapu modi gujarat supreme court

చంద్రబాబు, కేసీఆర్‌. తిరిగి అధికారంలోకి రావడం కోసం రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారు. కేసీఆర్‌ ముస్లింలకు ఏకంగా నాలుగు శాతం నుంచి 12 శాతానికి రిజర్వేషన్లు పెంచుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అటు చంద్రబాబు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి కాపులకు 5శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రానికి పంపారు. ఇలా చేయడం ద్వారా ఇద్దరు చంద్రుల్లో స్థానికంగా ఉన్న ఆయా వర్గాలను బుట్టలో వేసుకోవచ్చని భావిస్తున్నారు. తెలివిగా రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రం కోర్టులోకి నెట్టి చంకలు గుద్దుకున్నారు. అయితే వీరి ఎత్తులను మోడీ వెంటనే చిత్తు చేసేశారు.

50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇస్తామని ఎవరైనా చెబితే అది మోసగించడమేనని గుజరాత్‌లో స్పష్టం చేశారు. అది కూడా చంద్రబాబు కాపు రిజర్వేషన్లపై తీర్మానం చేసిన కొద్ది రోజులకే. సుప్రీం తీర్పు ప్రకారం 50 శాతానికి రిజర్వేషన్లు మించకూడదని.. అలాంటప్పుడు సుప్రీం తీర్పుకు విరుద్దంగా రిజర్వేషన్ల పెంపుపై ఎలా హామీ ఇస్తారని మోడీ ప్రశ్నించారు. దీంతో ఇద్దరు చంద్రులు ఉలిక్కిపడ్డారు. రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రం నెత్తిన వేసి.. ఇక్కడ రాజకీయ లబ్ది పొందాలనుకున్న చంద్రబాబు, కేసీఆర్‌లు మోడీ స్టేట్‌మెంట్‌తో ఉలిక్కిపడ్డారు.

ఇంతకాలం తీర్మానం చేసి పంపాం…. రిజర్వేషన్లు ఇచ్చేలా మోడీపై ఒత్తిడి తెస్తామని చెబుతూ వచ్చిన ఇద్దరు చంద్రులు ఇప్పుడు తిరిగి నోరు విప్పాల్సిన పరిస్థితి వచ్చింది. 50 శాతానికి మించి రిజర్వేషన్లు సాధ్యం కాదని మోడీ తేల్చేసిన నేపథ్యంలో… కాపు రిజర్వేషన్ల కోసం చంద్రబాబు, ముస్లిం రిజర్వేషన్ల కోసం కేసీఆర్ ఏం చేస్తారోచూడాలి. ఏడాదిన్నర కాలంగా మోడీ అపాయింట్‌మెంట్‌కు కూడా నోచుకోని చంద్రబాబు… కేంద్రం వద్ద గాండ్రిస్తారా?. లేక రాష్ట్ర ప్రయోజనాల కోసమే తలదించుకుంటున్నా అంటూ రోటీన్ డైలాగ్‌తో సరిపెడుతారా చూడాలి.

NEWS UPDATES

CINEMA UPDATES