అవి…. బాబుకు చమటలు పట్టిస్తున్నాయి

2154

తెలుగుదేశం పార్టీ అధినేతను హైరానా పెట్టిస్తున్నాయి సర్వేలు. ఒకవైపు తన సర్వే ఫలితాలు అంటూ చంద్రబాబు నాయుడు తరచూ తోచిన నంబర్లు చెబుతూ ఉంటాడు. అందులో ప్రధానమైనది తన విషయంలో ఉన్న అనుకూలత. ఏకంగా 80 శాతం మంది ప్రజలు తన పాలనపై చాలా సంతోషంగా ఉన్నారని చంద్రబాబు నాయుడు చెప్పుకొంటూ ఉంటాడు.

అయితే ఎవరి పాలన గురించి వారు చేసుకునే ప్రకటనల్లో ఇలాంటి నంబర్లు అంత కిక్ ను ఇవ్వవు. చంద్రబాబు తన పాలన గురించి ప్రజలు అసహనంతో ఉన్నారని చెప్పలేడు కదా. అందులోనూ చంద్రబాబు నాయుడు కొట్టుకునే సొంత డబ్బా సంగతి అందరికీ తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఆయన 80 శాతం మంది హ్యాపీగా ఉన్నారన్నా, వందశాతం మంది తుళ్లుతూ ఆనందంగా ఉన్నారన్నా అదంత సీరియస్ వ్యవహారం కాదు.

ఇదే సమయంలో మీడియా అలర్ట్ అవుతోంది. వచ్చే ఎన్నికల ఫలితాల గురించి ప్రిడిక్షన్స్ మొదలయ్యాయి. జాతీయ మీడియా ఈ విషయంలో ముందుంది. అందులో భాగంగా ఇటీవల ఇండియా టుడే సర్వేలో కూడా తెలుగుదేశం పార్టీ చిత్తు అవుతుందనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి. అంతకు ముందు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వారి సర్వేలో కూడా చంద్రబాబు నాయుడు వెనుకబడి ఉన్నాడని స్పష్టం అవుతోంది.

అలాగే ఆజ్‌ తక్‌ సర్వేలోనూ చంద్రబాబు చాలా వెనుకబడి ఉన్నాడు. వివిధ అంశాల వారీగా ఆ సంస్థ సర్వేను చేసింది. పాయింట్ల వారీగా చూస్తే దేంట్లోనూ చంద్రబాబు నాయుడు ఆకట్టుకోలేదని ఆ సర్వే తేల్చి చెప్పింది. మొత్తానికి చంద్రబాబు నాయుడుకు ఈ సర్వేలు చమటలు పట్టిస్తున్నాయి.

NEWS UPDATES

CINEMA UPDATES