చింత‌కింది మ‌ల్లేశానికి కోటి రూపాయ‌ల ప్ర‌భుత్వ న‌జ‌రానా

425

న‌ల్ల‌గొండ నివాసి, ఆసు యంత్రం సృష్టిక‌ర్త అయిన చింత‌కింది మ‌ల్లేశానికి తెలంగాణ ప్ర‌భుత్వం కోటి రూపాయ‌ల న‌జ‌రానా ప్ర‌క‌టించింది. ఐటి మంత్రి కెటిఆర్ మ‌ల్లేశానికి కోటి రూపాయ‌ల అనుమ‌తి ప‌త్రాన్ని అందించారు. నేత కార్మిక వ‌ర్గానికి చెందిన మ‌ల్లేశం త‌న త‌ల్లి క‌ష్టం చూడ‌లేక‌…ఒక యంత్రాన్ని త‌యారు చేశారు. దాంతో పోచం ప‌ల్లి చీర‌లు త‌యారు చేయడానికి ప‌ట్టే స‌మ‌యం.. చాలా వ‌ర‌కు త‌గ్గింది. మ‌ల్లేశం చేసిన కృషిని కేంద్ర ప్ర‌భుత్వం కూడా గుర్తించింది. ఈ ఏడాది ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారంతో స‌త్క‌రించింది.

మ‌ల్లేశం దాదాపు ఎనిమిదేళ్ల పాటు కృషి చేసి ఆసు యంత్రాన్ని త‌యారుచేశాడు. దాంతో ఆరు గంట‌లు ప‌ట్టే నేత ప‌ని గంట‌న్న‌ర‌లోపే పూర్త‌వుతోంది. మ‌ల్లేశానికి ప‌ద్మ‌శ్రీ అవార్డు వ‌చ్చిన సంద‌ర్భంలోనే …మంత్రి కెటిఆర్ ప్ర‌భుత్వం త‌ర‌పున కూడా కానుక‌ను అందిస్తాన‌ని మ‌ల్లేశానికి హామీ ఇచ్చారు. ఆ హామీని ఇప్పుడు నెర‌వేర్చారు.

మంత్రి కెటిఆర్ అందించిన కోటి రూపాయ‌ల గ్రాంట్‌తో భూమి కొనుగోలు చేసి, షెడ్డుల‌ను వేసి ల‌క్ష్మీ ఆసు యంత్రాల‌ను త‌యారు చేస్తారు. మ‌ల్లేశం త‌యారు చేస్తున్న‌లక్ష్మీ ఆసు యంత్రాల వ‌ల్ల పోచం ప‌ల్లి నేత కార్మికుల‌కు అత్యంత  ప్రయోజనం క‌ల‌గ‌నుంది.

మ‌ల్లేశానికి కోటి రూపాయ‌ల గ్రాంట్ అందించిన కెటిఆర్ …గ్రామీణ టాలెంట్‌ను తమ ప్రభుత్వం ప్రోత్స‌హిస్తుంద‌ని హామీ ఇచ్చారు. గ్రాంట్ అందుకున్న మ‌ల్లేశం మంత్రి కెటిఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. చేనేత రంగానికి ఉప‌యోగ‌ప‌డే ప‌నులు మ‌రిన్ని చేస్తాన‌ని భ‌రోసా వ్య‌క్తం చేశారు.

NEWS UPDATES

CINEMA UPDATES